అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం : జగన్, చంద్రబాబు ప్రమాణం

Submitted on 12 June 2019
ap assembly sessions start.. jagan, chandrababu oath

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవే తొలి అసెంబ్లీ సమావేశాలు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ముందుగా సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

బుధవారం (జూన్ 12,2019) నుండి 5 రోజులపాటు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. ఉదయం 11.05 గంటలకు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 13వ తేదీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను సభ ఎన్నుకోనుంది. జూన్ 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 15, 16 తేదీల్లో సభకు సెలవు. 17, 18 న తిరిగి సెషన్స్ ప్రారంభించనున్నారు. 18న సమావేశాలు ముగుస్తాయి.

AP Assembly
sessions
start
Ys Jagan
Chandrababu
TDP
YSR congress party

మరిన్ని వార్తలు