తమ్మినేని స్పీకర్ అయితే..అచ్చెన్నాయుడికి కడుపు మంట - రోజా

Submitted on 13 June 2019
ap assembly sessions ycp mla roja speech

స్పీకర్ ని అవమానించడం..స్పీకర్ ఛైర్ మిస్యూస్ చేయడంలో టీడీపీ సభ్యుడు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. స్పీకర్ గా తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయితే..టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుకు కడుపుమంట ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు రోజా. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సభలో గందరగోళం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 

ఈ సందర్భంగా రోజా..మాట్లాడుతూ..గతంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా నియమితులైతే..అవమానించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు కూడా తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎన్నికైనా..అగౌరవపర్చడం తమను బాధిస్తోందన్నారు. తమ తోటి సభ్యుడు చెవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్న టీడీపీ సభ్యులు గతంలో ఏమి మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

గుంజీలు..చెంపలు వేసుకున్నా సరిపోదన్నారు. ఎన్టీఆర్ గురించి గొప్పలు మాట్లాడుతారని..వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత..కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తే తన నోరు నొక్కడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు.

స్పీకర్ స్థానాన్ని మిస్యూస్ చేసి తనను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని..ఇది న్యాయమా ? అని సభలో ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని గౌరవించకుండా తనను లోనికి రానీయకుండా మార్షల్ తో బయటకు పంపించారని..ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే..దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. స్పీకర్ గా ఎన్నికైనందుకు తమ్మినేని సీతారాంకు ఆమె అభినందనలు తెలియచేశారు. 

AP Assembly
sessions
ycp mla roja
speech
Chevireddy

మరిన్ని వార్తలు