ఏపీ బడ్జెట్ : వివిధ రంగాలకు కేటాయింపులు

Submitted on 12 July 2019
AP Budget 2019-20: Provisions for various sectors

ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్. నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ఏపీ బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లుగా చూపించారు. 2018-19 బడ్జెట్ తో పోలిస్తే 19.32 శాతం పెరుగుదల ఉంది. జీఎస్ డీపీలో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంది.  

ఏపీ బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లు 
రెవెన్యూ వ్యయం రూ.1,80, 475.94 కోట్లు
మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు 
వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8994 కోట్లు 
రెవెన్యూ లోటు రూ.1,778.52 కోట్లు 
ద్రవ్యలోటు రూ.35,260.58 కోట్లు
సాధారణ విద్యకు రూ.32, 618.46 కోట్లు 
సాంకేతిక విద్య రూ.580.29 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.6,861 కోట్లు 
వైద్య ఆరోగ్యశాఖకు రూ.11, 399.23 కోట్లు
నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2234.77కోట్లు 
గృహ నిర్మాణానికి రూ.3,617.37 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.29, 329.98 కోట్లు 
పట్టణాభివృద్ధికి రూ.6587.09 కోట్లు
సమాచార ప్రసారానికి రూ.191.02 కోట్లు 
సంక్షేమ రంగానికి రూ.14,142.99 కోట్లు
సాంఘిక సంక్షేమం రూ.75,465.02 కోట్లు 
బీసీ వెల్ఫేర్ రూ.7271.45 కోట్లు
వ్యవసాయానికి రూ.20, 677.08కోట్లు 
ఉపాధి కార్మిక శాఖకు రూ.978.58 కోట్లు 
క్రీడలు, యువజన శాఖకు రూ.329.68 కోట్లు 
వైఎస్ఆర్ భరోసాకు రూ.8,750 కోట్లు 
పరిశ్రమలకు రూ.3986.05 కోట్లు 
ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ రూ.13,139.05 కోట్లు 
రవాణా శాఖకు రూ.6,157.25 కోట్లు
జనరల్ ఈసీవో సర్వీసెస్ రూ.6,025.27 కోట్లు 
ఏటా మే నెలలో రైతులకు రూ.12,500 కోట్లు 
కౌలు రైతులకు రైతు భరోసా
పరిశ్రమలకు రూ.3986.05 కోట్లు
అగ్రిగోల్డు బాధితులకు రూ.1150 కోట్లు 
అమ్మఒడి పథకం రూ.6455 కోట్లు
హోంశాఖకు రూ.7461.92 కోట్లు 
మైనారిటీ సంక్షేమానికి రూ.2,106 కోట్లు
వైఎస్ ఆర్ బీమా పథకానికి రూ.404.02 కోట్లు
వైఎస్ ఆర్ ఫించన్ పథకానికి రూ.15,746.58 కోట్లు 
 

AP Budget 2019-20
various sectors
Provisions
minister buggana rajendranath reddy


మరిన్ని వార్తలు