బడ్జెట్ లో బ్రేకింగ్ : విద్యకు రూ.32వేల 618 కోట్లు

Submitted on 12 July 2019
AP Budget 2019-20 : Rs 32, 618.46 crore for general education

ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్. నవరత్నాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారు. 

ఏపీ బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లుగా చూపించారు. 2018-19 బడ్జెట్ తో పోలిస్తే 19.32 శాతం పెరుగుదల ఉంది. జీఎస్ డీపీలో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉంది. విద్యారంగం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బడ్జెట్ లో విద్యా రంగానికి ప్రాధన్యత ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ లో సాధారణ విద్యకు రూ.32, 618.46 కోట్లు కేటాయించారు.
 
సాంకేతిక విద్య రూ.580.29 కోట్లు, వైఎస్ ఆర్ స్కూల్ నిర్వహణ గ్రాంట్ రూ.160 కోట్లు, వైఎస్ ఆర్ గిరిజన మెడికల్ కాలేజీ కోసం రూ.66 కోట్లు, గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం రూ.66 కోట్లు, విజయనగరం ప్రభుత్వం మెడికల్ కాలేజీ కోసం రూ.66 కోట్లు, స్కూళ్లలో మౌలిక వసతులకు రూ.1500 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు కేటాయించారు. 
 

AP Budget 2019-20
Rs 32
618.46 crore
general education


మరిన్ని వార్తలు