ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల 27వేల 974 కోట్లు

Submitted on 12 July 2019
AP Budget 2019 LIVE | YS Jagan Mohan Reddy | Buggana Rajendranath

ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బుగ్గనకు ఇది తొలి బడ్జెట్. మహాత్మాగాంధీ లక్ష్యాన్ని సాధించే దిశగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. బడ్జెట్ అంచనా రూ. 2లక్షల 27వేల 974.99 కోట్లుగా ప్రకటించారు. రెవెన్యూ వ్యయం రూ.లక్షా 80వేల 475.94 కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయం రూ.32వేల 293 కోట్లుగా చూపించారు.

వడ్డీ చెల్లింపులకు నిమిత్తం రూ. 8వేల 994 కోట్లుగా బడ్జెట్ గా వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే 19.32 శాతం పెరిగింది. రెవెన్యూ లోటు రూ. వెయ్యి 778 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ. 35వేల 260 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.3 శాతంగా పేర్కొన్నారు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 0.17 శాతంగా తెలిపారు.

> వ్యవసాయానికి రూ. 20 వేల 672 కోట్లు. 
> పశుసంవర్థక శాఖ రూ. 1,912 కోట్లు. 
> బీసీ వెల్పేర్ రూ. 7వేల 271 కోట్లు.
> వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి రూ. వెయ్యి కోట్లు
> పంటల బీమా, ప్రస్తుత వాటా చెల్లింపునకు రూ. 1,063 కోట్లు

ap budget 2019
Ys Jagan Mohan Reddy
Buggana Rajendranath


మరిన్ని వార్తలు