ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

Submitted on 13 June 2019
AP CEO Gopala Krishna Dwivedi transferred

అమరావతి : ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు,  ఆయన స్ధానంలో కె.విజయానంద్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది.

గోపాలకృష్ణ ద్వివేదికి  ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.  ఆంధ్రప్రదేశ్ లోఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారనే పేరుంది.  కొన్నిరోజులు  విశ్రాంతి తీసుకుంటానని, తనకు కొద్ది రోజుల పాటు పోస్టింగ్ ఇవ్వవద్దని ద్వివేది కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

ద్వివేది స్ధానంలో నియమించబడిన విజయానంద్ 1992  బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హాయంలో కీలక శాఖల్లో పని చేశారు. జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు, బొగ్గు కొనుగోళ్లలో భారీ అక్రమాలు  జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్  మంత్రిగా పనిచేసిన ఐటీ శాఖలో ముఖ్య కార్యదర్శిగా కూడా విజయానంద్ పనిచేశారు. 

Andhra Pradesh
Chief Election Commissioner
CEO
gopala krishna dwivedi
Vijayanand

మరిన్ని వార్తలు