సీఎం జగన్ సంచలన కామెంట్స్ : టీడీపీ నుంచి వచ్చేవాళ్లు.. రాజీనామా చేసి రావాలి

Submitted on 13 June 2019
ap cm jagan fires on tdp in ap assembly

స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక తర్వాత మాట్లాడిన సీఎం జగన్.. అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపులపై సంచలన కామెంట్స్ చేశారు. గత సంప్రదాయం కొనసాగించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్షం హోదా ఉండదని చాలా మంది చెప్పారని.. అలా చేయటం సంప్రదాయం కాదని వారికి చెప్పినట్లు జగన్ వివరించారు. ఎవరైనా టీడీపీ వాళ్లు వస్తాం అంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని.. అప్పుడే తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేయటం ద్వారా పొలిటికల్ హీట్ పెంచారు సీఎం జగన్. టీడీపీలో టెన్షన్ పెంచారు. 

రాజీనామా చేయకుండా పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే.. వారిపై వెంటనే వేటు వేయాలని.. ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ ను కోరారు జగన్. టీడీపీ నుంచి వచ్చే వారు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్.. స్వయంగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్షం హోదా కూడా ఉండదని చెప్పటం వెనక కూడా భవిష్యత్ లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పారా అనే చర్చ అప్పుడే మొదలైపోయింది. ఇన్ని మాటలు అన్న సీఎం జగన్.. ఎమ్మెల్యేలను లాగేసుకుంటే నాకు - చంద్రబాబుకు తేడా ఏంటీ అని కూడా అన్నారు.

Ys Jagan Mohan Reddy
AP Assembly
Chandrababu
Tammineni Sitaram
tdp mlas
YSR congress party

మరిన్ని వార్తలు