బాబు డిమాండ్ : నేనెందుకు రాజీనామా చేయాలి.. జగన్ క్షమాపణ చెప్పాలి

Submitted on 11 July 2019
AP CM Jagan Should Resign

తాను ఎందుకు రాజీనామా చేయాలి అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ అబద్దాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా వ్యవహరించిందన్నారు. ఐదు కోట్ల ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారాయన. క్షమాపణలు చెపపకపోతే.. జగన్ రాజీనామా అయినా చేయాలని కోరారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు బాబు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారాయన.

2019, జూలై 11వ తేదీ గురువారం ఏపీ అసెంబ్లీలో కరువుపై చర్చ జరిగింది. ఈ చర్చలో చంద్రబాబు ప్రభుత్వం తప్పులు చేసినట్లు సీఎం జగన్ లెక్కలు వివరించారు. రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ఇదీ అంటూ వీడియోలు ప్రదర్శించారు. దీనిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆ సమయంలో తన దగ్గర రికార్డులు లేవన్నారు. ఆ తర్వాత అన్నీ పేపర్లు సభకు తీసుకొస్తే.. అత్యవసరంగా సభ వాయిదా వేసుకుంటూ వెళ్లిపోయారని విమర్శించారు. 36 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తనను అసెంబ్లీ సాక్షిగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. 

అసెంబ్లీ సమావేశాలు ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదన్నారు బాబు. గాడిదలు కాస్తున్నారా అని మాట్లాడుతారా ? అని నిలదీశారాయన. పోలవరంపై చర్చకు వస్తే..రూ.400 కోట్లు దొబ్బేశారంటూ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ఇది సబబు కాదన్నారు బాబు.

AP CM JAGAN
Should Resign
Babu Live
AP Assembly


మరిన్ని వార్తలు