సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరేసిన జగన్

Submitted on 15 August 2019
AP CM YS Jagan Flag Hoisting At Indira Gandhi Stadium

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎగరవేశారు.

అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి జెండా ఎగురవేశారు. మరోవైపు ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగరేసి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు.

AP CM YS Jagan
FLAG HOISTING
Indira Gandhi Stadium

మరిన్ని వార్తలు