జూలై 8 నుంచి AP EAMCET వెబ్ ఆప్షన్లు

Submitted on 6 July 2019
AP EAMCET Web Options Postponed To July 8, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి AP EAMCET-2019 కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగాయి. అసలు షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ల రిజిస్ట్రేషన్ కు జూలై 3 నుంచి 8 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇంటర్మీడియెట్ మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారి ఫలితాలు ఇంకా రాకపోవడంతో సర్టిఫికెట్లు అందలేదు. దీంతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జూలై 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

దీంతో వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌లో మార్పు చేయాల్సివచ్చింది. జూలై 3 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల రిజిస్ట్రేషన్  ప్రక్రియను జూలై 8, 2019 నుంచి ప్రారంభిస్తామని EAMCET అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు.  

వెబ్ ఆప్షన్ల షెడ్యూల్..
> జూలై 8, 9 తేదీల్లో 1 నుంచి 30,000.
> జూలై 10, 11 తేదీల్లో 30,001 నుంచి 75,000.
> జూలై 12, 13 తేదీల్లో 75,001 నుంచి చివరి ర్యాంకు వరకు.
> జూలై 14 తేదీ ఆప్షన్ల మార్పు.
> జూలై 16 తేదీ సీట్ల కేటాయింపు.

AP Eamcet
web options
Postponed To July 8
2019

మరిన్ని వార్తలు