ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Submitted on 13 June 2019
AP Inter Advanced Supply Results 2019 Declared

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం (జూన్ 13, 2019)న విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు మే 14 నుంచి 22 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,24,500 మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో లక్ష 75వేల మంది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాశారు. 

ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నాం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

AP
Inter Advanced Supply
results
2019

మరిన్ని వార్తలు