ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Monday, October 16, 2017 - 14:04

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో నిర్మిస్తోన్న.. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కును నిలిపివేయాలని స్థానికులు ఉద్యమబాట పట్టారు. నర్సాపురం మండలం, కంసాల బేతపూడిలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో.. నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను సీపీఎం నాయకుడు ఆచంట మాజీ ఎమ్మెల్యే రాజగోపాలం ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేసి వేరే చోటకు...

Monday, October 16, 2017 - 07:59

పశ్చిమగోదావరి : జిల్లా రాజకీయాల్లోకి జనసేన పార్టీ ఎంటరైంది. మెల్లమెల్లగా జనసేన తన సైన్యాన్ని పెంచుకుంటోంది. ఈ మధ్య జరిగిన జనసైనికుల ఎంపికకు రెట్టింపు సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీలోని ఇతర జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా..... పవన్‌ సొంత జిల్లా.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాపై మాత్రం...

Thursday, October 12, 2017 - 16:28

పశ్చిమగోదావరి : ఏపీలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో అగ్రిగోల్డ్ బాండ్లు, సర్టిఫికేట్ల పరిశీలనకు బాధితులు  భారీగా హాజరయ్యారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2వేల 707 మంది బాధితులు ఉన్నారు. మరికొంతమంది ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. బాధితులకు పూర్తి వివరాలు తెలిపేందుకు...

Thursday, October 12, 2017 - 15:12

పశ్చిమగోదావరి : ఏలూరులో అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్‌లను ఏర్పాటు చేశారు. డబ్బులు తిరిగొస్తాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాళ్ల పేర్లను బోర్డుల్లో చూసుకునే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. ఏలూరు 1 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుండి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం......

Wednesday, October 11, 2017 - 09:15

పశ్చిమగోదావరి : జిల్లా పోలవరంలో భారీ వర్షం కురవడంతో ఇసుక వాగు 10 అడుగుల ఎత్తు నీటితో పొంగిపొర్లింది. ఇటుకలకోట గ్రామంలో నీటి ప్రవాహానికి 15 ఇళ్లు కొట్టుపోయాయి. రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. కొత్తూరు కాజ్వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, October 9, 2017 - 15:47

పశ్చిమగోదావరి : తమకు కనీస వేతనం 6 వేల రూపాయలు ఇవ్వాలంటూ ఏలూరులో ఆశావర్కర్లు ఆందోళనబాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. తాము చేస్తున్న పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదంటూ ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియో చూడండి.

Sunday, October 8, 2017 - 08:37

పశ్చిమగోదావరి : ఆకివీడులో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. భీమవరం నుండి ఏలూరుకు ఆటోలో బాణాసంచా తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆకివీడు వద్ద ఆటోలో మంటలు చెలరేగాయి. బాణాసంచా పేలడంతో ఆటో డ్రైవర్ నాగరాజు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉంది. వారిని...

Saturday, October 7, 2017 - 19:19

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం, తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజా...

Pages

Don't Miss