ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Tuesday, September 12, 2017 - 07:37

పశ్చిమగోదావరి : జిల్లాలో ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. భీమవరం మండలం తుందుర్రులో బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఆక్వా పరిశ్రమని పూర్తిగా ఎత్తేవేసేంతవరకు ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే.. చంద్రబాబు ప్రభత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన కారులు హెచ్చరించారు. 

Monday, September 11, 2017 - 17:10

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కును తరలించాలంటూ కంసాల భేతపూడి గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. గత మూడు సంత్సరాలుగా ఫ్యాక్టరీని నిర్మిచొద్దంటూ ఆందోళనలు చేస్తున్న చంద్రబాబు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని అన్నారు. పోలీసు కేసులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు ఆక్వా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా...

Sunday, September 10, 2017 - 19:23

పశ్చిమగోదావరి : జిల్లా మొగల్తూరు మండలం సేరేపాలెంలో ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు చెందిన మట్టి లారీలను రైతులు అడ్డుకుని ధర్నా నిర్వహించారు. వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి పంపేందుకు పైప్‌లైన్‌ వేస్తామని చెప్పిన కంపెనీ యాజమాన్యం... పైపులైన్లు వేయకుండానే నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్ధాలతో తమ పంటలు నాశనమవుతాయని... కంపెనీకి వెళ్తున్న లారీలను...

Sunday, September 10, 2017 - 16:14

పశ్చిమగోదావరి : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ జైల్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు గోడ దూకి సిరపు గణేష్, బుగత శివ పారిపోయారు. ఉదయం ఖైదీలకు కటింగ్ చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అదే అదునుగా చేసుకుని మధ్యాహ్నం 12గంటల సమయంలో గోడ దూకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Saturday, September 9, 2017 - 15:34

పశ్చిగోదావరి : జిల్లా వేలేపాడు మండలం ఎర్రబోరులో కలకలం రేగింది. చేతబడి చేశారన్న అనుమానంతో ఓ గిరిజనుడు ఏకంగా తన కడుపును అడ్డంగా కోసుకున్నాడు. వెంకటేశ్వర్లు ఈ నెల 6న కత్తిపీటతో కడుపును కోసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, September 8, 2017 - 12:32

పశ్చిమగోదావరి : తమ కులం ఏంటో నిర్ధారించి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు నాయకపోడు కులస్తులు. పశ్చిమగోదావరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న నాయకపోడు కులస్తులకు ప్రభుత్వం కుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఎందరో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. కొందరు జిల్లా కలెక్టర్‌ చొరవతో స్కూళ్లల్లో చేరినా కాలేజీ చదువులకు మాత్రం దూరం అవుతున్నారు....

Friday, September 8, 2017 - 08:11

పశ్చిమగోదావరి : పెళ్లయింది...మూడు నెలలు గడిచింది...ఆమెకు భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదేమో...అందుకే ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేస్తుంది.. ప్రతీసారి భర్త అడ్డుగా ఉన్నాడనుకుంటున్న ఆ నవవధువు అతన్ని చంపాలనుకుంది..ఆమెనే నర్సు కావడంతో భర్తకు విషపు మందు కలిపి ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది...తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్న ఓ నవవధువు దుర్మార్గమిది...

జిల్లా...

Thursday, September 7, 2017 - 19:48

పశ్చిమగోదావరి : జిల్లాలో కట్టుకున్న భర్తనే హత్య చేసింది భార్య... విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి చంపేసింది. గతనెల 29న దేవరపల్లి మండలం నిర్మలగిరిలోగుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.... మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా గుర్తించారు. ఆయనకు ఈ ఏడాది మేలో...

Thursday, September 7, 2017 - 15:26

పశ్చిమగోదావరి : పోలరం నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. జిల్లాలోని బుట్టాయిగూడెంలో ఆయన పర్యటించి నిర్వాసితులకు సంఘీభావం వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ...గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటే ఊరుకోమని, నిర్వాసితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు...

Wednesday, September 6, 2017 - 13:29

పశ్చిమగోదావరి : నంద్యాల ఉప ఎన్నిక ఒకరి ప్రాణాలు తీసింది. ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడుతారనే దానిపై ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది. గోలి శ్రీను, శివ అనే ఇద్దరు వ్యక్తులు టిడిపి గెలుపుపై రూ. 16 వేలు కాశారు. ఈ ఎన్నికల్లో టిడిపి గెలిచిన సంగతి తెలిసిందే. దీనితో...

Pages

Don't Miss