ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Wednesday, July 15, 2015 - 21:22

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీతో పుష్కర ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి. పుష్కర గోదావరిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు లక్షలాదిగా తరలివెళ్తున్నారు. భక్తుల జయజయ ధ్వానాలతో పుష్కర ఘాట్లు మారుమోగుతున్నాయి. కనీవినీ ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలకు భక్తులు లక్షల సంఖ్యలో పొటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో...

Wednesday, July 15, 2015 - 11:51

హైదరాబాద్:వైసీపీ నేత జగన్‌ పుష్కర స్నానం చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయన గోదావరిలో పుష్కరస్నానం చేశారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు

Tuesday, July 14, 2015 - 06:51

హైదరాబాద్ : ఉభయ గోదావరి జిల్లాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక శోభతో పుష్కరఘాట్లు కళకళలాడుతున్నాయి. కాసేపట్లో అఖండ గోదావరి పుష్కరాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనేందుకు... రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. గోదావరి తీరాల్లో పుష్కరాల సంరంభం మొదలైంది. సకల పుణ్య ప్రదాతగా గోదారమ్మ...

Sunday, July 12, 2015 - 06:26

తూర్పుగోదావరి : సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కు గురయ్యారు. పుష్కర పనుల్లో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. ఉద్యోగులే దీనికి కారణమని భావించిన సీఎం బాబు వారిని సస్పెండ్ చేశారు. రాజమండ్రికి శనివారం చేరుకున్న సీఎం ఆకస్మిక తనిఖీలతో అధికారులను బెంబేలెత్తించారు. పుష్కర పనుల్లో జరుగుతున్న అలసత్వంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....

Thursday, July 9, 2015 - 18:44

పశ్చిమగోదావరి : ముసునూరు తహశీల్దార్ దాడి ఘటనపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 13వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ కృష్ణా రావు, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది.
తవ్వకాలు అడ్డుకున్నందుకు దాడి...
పశ్చిమగోదావరి...

Thursday, July 9, 2015 - 18:15

చిత్తూరు : గోదావరి పుష్కరాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరికి సమర్పించడానికి శ్రీవారి ఆలయం నుంచి సారె రాజమండ్రికి బయలుదేరింది. స్వామి వారి విగ్రహం, పసుపు, కుంకుమ తదితర పూజాసామాగ్రితో కూడిన ప్రత్యేక వాహనం రాజమండ్రికి బయలదేరింది. వాహనం తిరుచానూరు, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడల మీదుగా రాజమండ్రి పుష్కర ఘాట్‌కు చేరుకుంటుంది. ఈ నెల 14న సీఎం చేతుల...

Thursday, July 9, 2015 - 18:13

పశ్చిమగోదావరి : అతడు చట్టసభల్లో సభ్యుడు...కానీ చట్టాలంటే అస్సలు గిట్టదు. అధికార పార్టీ ఎమ్మెల్యే..అయినా అధికారులంటే అలుసు. తాజాగా మహిళా ఎమ్మార్వోపైనే దాడికి దిగి తన దౌర్జన్యాన్ని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి దెందులూరుకు చెందిన ఈ ఎమ్మెల్యే తీరుతో ఇప్పడు అధికార టిడిపికి తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా చింతమనేని...

Sunday, July 5, 2015 - 19:59

పశ్చిమగోదావరి: జిల్లాలోని పెరవలి మండలం ఖండవల్లిలో కుదేలైన అరటి రైతులను సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి. మధు పరామర్శించారు. ఈనెల 6న చేపట్టబోతున్న అరటి రైతు సదస్సుకు ఆయన మద్దతు పలికారు. చెరకు, మిర్చి రైతుల మాదిరే అరటి రైతులకు కూడా రుణ మాఫీ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అరటి రైతు సదస్సును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Pages

Don't Miss