ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Wednesday, March 1, 2017 - 17:27

పశ్చిమ గోదావరి : జిల్లాలో నక్కావారి పాలెంలో డ్వాక్రా మహిళలు బెల్ట్‌ షాపులకు వ్యతిరేకంగా కదం తొక్కారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. బెల్ట్‌ షాపుల్లో మద్యం సేవించి స్థానికులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. అందుకే గ్రామంలో మద్యం విక్రయించరాదని తాము డిమాండ్ చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. మరిన్ని వివరాలు వీడియోలో...

Wednesday, March 1, 2017 - 15:32

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ.మధు డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే. మార్చి 8న 33 గ్రామాల మహిళలతో  ఆక్వాఫుడ్‌ పార్క్‌ను ముట్టడిస్తామని మధు హెచ్చరించారు. ఈ సందర్భంగా మధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన అన్న మాటల్ని వీడియోలో చూడొచ్చు. 

Tuesday, February 28, 2017 - 11:26

పశ్చిమగోదావరి : పొట్ట కూటి కోసం కూలీ పనులు చేస్తూ జీవనం గడుపుతున్న ఇద్దరు మహిళలను విధి వక్రీకరించింది. విద్యుత్ వైర్లు మీద పడడంతో మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటన నిడదవోలు మండలం తాడిమళ్లలో చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం దినసరి కూలీలుగా మహిళలు వెళుతుంటారు. అందులో భాగంగా తాడిమళ్ల ప్రాంతానికి చెందిన మంగతాయారు, మహాలక్ష్మిలు చెరుకు పంటలో పనిచేయడానికి వెళ్లారు....

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో...

Tuesday, February 28, 2017 - 06:45

విజయవాడ : ఏపీలో కరెంటు చార్జీలు పెంచాలన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో దాదాపు 2వేల కోట్ల రూపాయల లోటు చూపించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయం సేకరణ...

Monday, February 27, 2017 - 12:12

పశ్చిమగోదావరి : మెట్రో ప్రాంతాలు..నగరాలను దాటిన 'రేవ్' పార్టీ పల్లెలకు పాకింది. జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. నిడమర్రు మండలం ఫత్తేపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నమూర్తి రాజు గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. 16 మంది యువకులు, 10 మంది యువతులున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. అశ్లీలంగా నృత్యాలు చేస్తున్న వీరిని...

Monday, February 27, 2017 - 11:26

విజయవాడ : ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. ఒక్కఛాన్స్‌ అంటూ ఆశావహులు టిక్కెట్ల కోసం పాట్లు పడుతుంటే.. ఏ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలన్న మీమాంసలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఇవాళ్టి పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే.. యథావిధిగా, అభ్యర్థుల ఎంపిక నిర్ణయాధికారాన్ని అధినేత చంద్రబాబుకి...

Friday, February 24, 2017 - 12:42

పశ్చిమగోదావరి : మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు  క్షీరారామలింగేశ్వరామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. క్షీరారామలింగేశ్వరుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అభిషేకాలు చేస్తున్నారు.  ఇవాళ రాత్రికి ఘనంగా కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Friday, February 24, 2017 - 12:40

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో శివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. పోలవరం మండలంలోని పట్టిసీమ దగ్గర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పట్టిసీమ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మరిన్ని వివరాల్ని వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss