ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Friday, June 8, 2018 - 18:33

పశ్చిమగోదావరి : ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఆందోళన చేశారు. సీపీఎస్‌ విధానం ద్వారా ఉద్యోగులకు నష్టమని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఉద్యోగ సంఘాలు...

Thursday, June 7, 2018 - 12:09

పశ్చిమగోదావరి : జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. 183వ రోజు నిడదవోలు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. పెరవలి మండలం కానూరు వద్దకు రాగానే తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతంలో మామిడి తోటలు న్నాయి. ఇక్కడ తేనెతుట్టలు భారీగా ఉన్నాయి. మామిడి కాయలు కోస్తుండగా తేనెటీగలు పాదయాత్రవైపుకు వచ్చాయి. దీనితో కార్యకర్తలు..నేతలు...

Thursday, June 7, 2018 - 06:52

విజయవాడ : వైసీపీ ఎంపీల రాజీనామాలపై జగన్‌ స్పందించారు. రాష్ట్రం కోసం ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు భయపడ్డారని జగన్‌ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం...

Wednesday, June 6, 2018 - 20:49

ప.గో : వైసీపీ ఎంపీల రాజీనామాలపై జగన్ స్పందించారు. పదవులకు ఇంకా పద్నాలుగు నెలల గుడువున్నా రాష్ట్రం కోసం ఎంపీలు ధైర్యంగా రాజీనామాలు చేశారని అన్నారు. అదే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయించేందుకు చంద్రబాబు భయపడ్డారని పేర్కొన్నారు.

 

Tuesday, June 5, 2018 - 19:54

ప.గో : ఇంజనీరింగ్ ఫీజు లక్షకు పైగా ఉందని... ప్రభుత్వమిచ్చే ఫీజు రియింబర్స్ మెంట్ 30 నుంచి 35 వేల రూపాయలని..విద్యార్థులు చదువులను ఎలా కొనసాగిస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా తణుకులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ ఫీజు లక్షకు పైగా ఉంది...కానీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 30 నుంచి 35 వేల రూపాయలని... మిగిలిన 65 వేలను...

Monday, June 4, 2018 - 11:57

పశ్చిమగోదావరి : కొయ్యలగూడెం మండలం గవరవరం పంచాయితీ పరిధిలో విషాదం జరిగింది. చొప్పరామన్న గూడెంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతులైన తగరం విజయరాజు, ప్రియాంకలు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Monday, June 4, 2018 - 11:02

పశ్చిమగోదావరి : జిల్లా పర్యటనలో జగన్‌ సీఎం చంద్రబాబను టార్గెట్‌ చేశారు. గత నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు  రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్‌వన్‌గా మార్చారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు కేంద్రం వద్ద  అమ్ముకున్నారని జగన్‌ అన్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో  వైసీపీ అధినేత పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జగన్నాథపురం నుంచి...

Monday, June 4, 2018 - 10:51

ప.గో : కొయ్యలగూడెం మండలంలో విషాదం నెలకొంది. పెళ్లైన మూడు నెలలకే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప.గో జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంకు చెందిన విజయరాజు, హైదరాబాద్ కు చెందిన ప్రియాంకలు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. చొప్పరామన్నగూడెంలోనే ఉందామని విజయరాజు అనగా... హైదరాబాద్ లో ఉందామని ప్రియాంక అంటుంది. ఇదే విషయంపై ఇరువురి మధ్య గొడవ...

Sunday, June 3, 2018 - 12:21

ప.గో : భీమవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అతివేగంగా వస్తున్న లారీ.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Sunday, June 3, 2018 - 10:52

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నిన్నటి వరకు గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన టీడీపీ నేతలు... తాజాగా కాలువలపై దృష్టి సారించారు. పోలవరం కుడి కాలువ నుంచి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిపూట భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికారుల అండతో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. 

...

Pages

Don't Miss