ap-district-westgodavari
పశ్చిమగోదావరి
పశ్చిమగోదావరి : పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడమే లక్ష్యమని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు స్పష్టం చేశాయి. వామపక్ష, అభ్యుదయ శక్తుల ఐక్యతతో బడుగులకు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా.. కొత్త శకానికి నాంది పలుకుతామని మహాసభలు ప్రతినబూనాయి. మూడు రోజుల పాటు సాగిన మహాసభల చివరిరోజైన నేడు.. పి.మధును రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు....
పశ్చిమగోదావరి : వివిధ రంగాల్లో సేవలందించిన 150మంది మహిళలను ఒకే వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని తాడేపల్లి గూడెంలోని మాధవవరంలో మనోజ్ఞ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగింది. మహిళా మణులను మనోజ్ఞ ట్రస్టు నిర్వాహకులు సత్కరించారు. రాజకీయ..సామాజిక..సేవా రంగాలే కాకుండా ఇతర రంగాల్లో ఉన్న మహిళలను సత్కరించడం విశేషం. ఈ ప్రాంతంలో మొదటి సారి...
పశ్చిమగోదావరి : భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు కాసేపటి క్రితం ముగిశాయి. గత మూడు రోజులుగా జరిగిన ఈ మహాసభల్లో జాతీయ, రాష్ట్రీయ..ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరి రోజైన సోమవారం పార్టీ కార్యదర్శి..ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండోసారి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు ఎంపికయ్యారు. 60 మంది సభ్యులతో...
రాజమహేంద్రవరం : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడం ఇప్పుడు జాతీయ అంశంగా మారిందని ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్డీయే మిత్రపక్షాలు ఆందోళనలో ఉన్నాయని, రాష్ట్ర బంద్ తో కేంద్రంపై ఏపీ ప్రజలు ఆగ్రహం ప్రకటించారని తెలిపారు. మార్చి 5వ తేదీ వరకు ఆశగా ఎదురు చూస్తామని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్...
పశ్చిమగోదావరి : ఏపీ విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదని.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చుకున్నా సాధించుకోలేకపోయిన టీడీపీని ప్రకాశ్ కరత్...
ప.గో : ఏపికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాని సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంతో తాము పోరాడుతామన్నారు. బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకున్న టీడీపీ... కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ భవిష్యత్ కార్యాచణేంటో ప్రజలకు చెప్పాలంటున్న ఏచూరితో టెన్ టివి ఫేస్ టూ...
పశ్చిమగోదావరి : విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానన్న కేంద్రం.. వాటిని విస్మరించిందన్నారు.
పశ్చిమగోదావరి : బీజేపీ-టీడీపీ మిత్రబంధం వల్ల సాధించిందేమీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. స్పెషల్ స్టేటస్.. ప్యాకేజీల పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను ఈ రెండు పార్టీలూ మోసం చేశాయని విరుచుకుపడ్డారు. భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న ఏచూరి, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ముకాస్తోందని మండిపడ్డారు....