ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Sunday, October 8, 2017 - 08:37

పశ్చిమగోదావరి : ఆకివీడులో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. భీమవరం నుండి ఏలూరుకు ఆటోలో బాణాసంచా తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆకివీడు వద్ద ఆటోలో మంటలు చెలరేగాయి. బాణాసంచా పేలడంతో ఆటో డ్రైవర్ నాగరాజు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉంది. వారిని...

Saturday, October 7, 2017 - 19:19

పశ్చిమగోదావరి : జిల్లా భీమవరం మండలం, తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా 32 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ప్రజా...

Saturday, October 7, 2017 - 18:08

పశ్చిమగోదావరి : జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పోలవరం నిర్వాసితులను పునరావాస గ్రామాలకు తరలించడంలో ఆర్డీఓ, తహశీల్దార్‌.. దొంగ బిల్లలు పెట్టి 80 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రికార్డులను తనిఖీలు చేశారు. వారం రోజుల క్రితమే... పోలవరం తహశీల్దార్‌ కార్యాలయంలో చేసిన ఏసీబీ అధికారులు......

Wednesday, October 4, 2017 - 20:14

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి అశ్వీయిజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. స్వామి వారి ఆలయం తూర్పు రాజగోపురం ఎదురుగా అలివేటి మండపంలో ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు, వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ్‌ రావు తెలిపారు...

Wednesday, October 4, 2017 - 13:09

పశ్చిమగోదావరి : జిల్లా వట్లూరులో ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త, భార్యను వదిలేశాడు. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి రావాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసి భర్త శ్రీకాంత్ ను భార్య తరుపు బంధువుల నిలదీశారు. ఎంతచెప్పినా వినకపోవడంతో శ్రీకాంత్ మహిళలు దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, October 3, 2017 - 21:20

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి పరిశీలీంచారు. నిర్మాణ పనుల ప్రగతిని జలవనరుల శాఖ అధికారులు గడ్కరీకి వివరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి కూడా జీవనాడి ప్రాజెక్టని, దీని నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం నీరు ఎంతో అవసరమని...

Tuesday, October 3, 2017 - 18:42

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుకు అన్నివిధాలా సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 2019 వరకు ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి ఆయన...

Saturday, September 30, 2017 - 06:43

పశ్చిమగోదావరి : జిల్లాలోని అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థలం తమదంటే.. తమదని.. కాపు, దళిత సామాజిక వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ వివాదానికి ఇంకా తెరపడకపోవడంతో పోలీసులు భారీ బందోబస్తు 
ఉరదాళ్ళపాలెంలో ఉద్రిక్తత...

Pages

Don't Miss