ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Thursday, November 12, 2015 - 16:15

ఏలూరు : కార్పొరేట్ స్కూళ్లపై ఏపీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కోళ్ల ఫారాలు తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి రావెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాటశాలలే నయమని తెలిపారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఆట లేదు...

Monday, November 9, 2015 - 13:23

పశ్చిమగోదావరి : జిల్లా శనివారపుపేటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న హత్యకు గురైన సంజీవరావు వ్యవహారంలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటిపై స్థానికులు దాడి చేశారు. ఇంట్లోని సామాన్లను బయటపడేసి ధ్వంసం చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపుచేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో...

Monday, November 9, 2015 - 06:35

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ, తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారనుంది. ఈ తుపానుకు రోవానుగా నామకరణం చేస్తూ ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.

సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం..
రోవాను తుపాను...

Saturday, November 7, 2015 - 17:40

పశ్చిమగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం మండలం పారిజాతగిరి సమీపంలో ఆటోబోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నాయిగూడెం వాసులుగా గుర్తించారు.

 

 

 

Saturday, November 7, 2015 - 11:57

పశ్చిమగోదావరి : దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటివానిలంకకు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించారు. కాగా... ఈ రోడ్డు రిజర్వు ఫారెస్టు గుండా వేస్తుండడంతో వైల్డ్...

Wednesday, November 4, 2015 - 16:22

.గో : ఆస్పత్రిలో చెక్‌అప్‌కోసం బయలుదేరిన ఓ గర్భిణి బస్టాండ్‌లో ప్రసవించింది.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఇది జరిగింది.. గొల్లలకోడేరు గ్రామానికిచెందిన నాగవల్లి కైకలూరు ఆస్పత్రికి బయలుదేరింది.. భీమవరం బస్టాండ్‌కువచ్చాక ఆమెకు నొప్పులు వచ్చాయి.. బాత్‌రూంలోనే ఆమె బిడ్డను ప్రసవించింది.. వెంటనే తోటి...

Monday, November 2, 2015 - 06:32

 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గడువును మరింత పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులను హెల్మెట్‌ పేరుతో ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు రవాణాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నవంబర్‌ 1నుంచి ద్విచక్ర...

Sunday, November 1, 2015 - 06:39

విజయవాడ : హెల్మెట్ లేకుండా రోడ్డెక్కుతున్నారా..? శిరస్త్రాణం కొనడం మర్చిపోయారా..? అయితే మీ ఆటలిక సాగవు. మీ కోసం కాదు..! మీ వాళ్ల కోసమైనా హెల్మెట్ ధరించండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అందుకే హెల్మెట్‌ లేకుండా రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులకు ఏపీ సర్కార్‌ స్పీడు బ్రేకులు వేస్తోంది. ఇవాళ్టి నుంచి శిరస్త్రాణాన్ని ధరించడాన్ని తప్పనిసరి...

Friday, October 30, 2015 - 18:41

ప.గో :సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృపామణి తల్లి లక్ష్మి, సోదరుడు రాజ్‌కుమార్‌‌, మరదలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Friday, October 30, 2015 - 14:20

ప.గో : ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వేలమందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన...

Pages

Don't Miss