ap-district-westgodavari

పశ్చిమగోదావరి

Sunday, January 14, 2018 - 11:38

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తేతలి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ను, సైకిల్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. వీరిని ఢీకొన్న కారు మరో ఇంట్లోకి దూసుకువెళ్లింది. మృతులు వేండ్ర సత్యన్నారాయణ, సోమయ్యగా గుర్తించారు. సంక్రాంతికి అత్తవారింటికి భీమవరం నుండి వచ్చినట్లు తెలుస్తోంది. పండగరోజు ఇలాంటి దారుణం జరగడంతో బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. మరిన్ని...

Sunday, January 14, 2018 - 11:36

పశ్చిమ గోదావరి : భోగి సంబరాలు ఏలూరులో ఘనంగా జరుగుతున్నాయి...45డివిజన్ లో కాలనీ వాసులంతా కలసి భోగి మంటలు వేసి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు... పిల్లలు, హుషారుగా భోగి శుభాకాంక్షలు తెలుపుతూ కేరింతలు కొడుతున్నారు... భోగభాగ్యాలతో ఈ సంక్రాంతి పండుగను అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నారు. భోగి  సంబరాలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 

Saturday, January 13, 2018 - 21:08

హైదరాబాద్ : పండుగొచ్చింది... పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. సంక్రాంతిని ఎంజాయ్‌ చేసేందుకు కుటుంబాలన్నీ పల్లెబాట పడుతున్నాయి. పండుగను ఘనంగా జరుపుకునేందుకు గ్రామాలన్నీ సిద్దమయ్యాయి. నగరవాసులంతా పల్లెకు తరలిపోతుండడంతో టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ జరుగుతోంది. మరోవైపు పట్టణవాసులంతా ఊర్లకు వెళ్తుండడంతో నగర వీధులన్నీ బోసిపోతున్నాయి.

తెలుగు...

Saturday, January 13, 2018 - 18:28

పశ్చిమగోదావరి జిల్లా : జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. సంక్రాంతి కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నాటుసారా ఎక్కువగా ఉండటంతో దాడులు చేశారు. జంగారెడ్డి గూడెం ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ముద్దప్పగూడెం, పంగిడిగూడెంలో దాడులు నిర్వహించి.. పద్దెనిమిది వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న ఒక...

Saturday, January 13, 2018 - 18:11

పశ్చిమగోదావరి : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంబరాల్లో ప్రముఖంగా పేర్కొనే కోళ్ల పందాలపై ఉత్కంఠ నెలకొంటోంది. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని కొంతమంది..నిర్వహించవద్దని పోలీసుల హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాలోని ద్వారకా తిరుమలలో కోడి పందాల బరులపై పోలీసులు దాడులు చేశారు. బరుల ఏర్పాటుకు స్థలం ఇచ్చిన రైతులపై కేసులు నమోదు...

Saturday, January 13, 2018 - 14:02

పశ్చిమ గోదావరి : జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. కాలేజీ విద్యార్థులు ముందుగానే సంక్రాంతి పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అందంగా అలంకరించుకొని ఎడ్లబండిపై ప్రయాణం చేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. భీమవరం విష్ణు ఇంజీనీరింగ్‌ కాలేజీ విద్యార్థుల సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

Saturday, January 13, 2018 - 13:27

పశ్ఛిమగోదావరి : జిల్లాలోని భీమవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మాయిలు ఉత్సహంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

Saturday, January 13, 2018 - 13:25

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల సంబరాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

Saturday, January 13, 2018 - 09:48

పశ్చిమ గోదావరి : జిల్లాలో కోడి పందాలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 700 మందికి పైగా బైండోవర్ కేసులు పెట్టారు. తనిఖీల కోసం 60 ప్రత్యేక బృందాలను నియమించామంటున్న జిల్లా ఎస్‌పీ రవిప్రకాశ్‌తో 10 టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోడి పందేల నియంత్రణకు...

Pages

Don't Miss