ఆదిలాబాద్
Saturday, August 11, 2018 - 11:28

ఆదిలాబాద్‌ : పట్టణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తులసీ రెస్టారెంట్‌కు ఎదురుగా ఉన్న పెన్నా స్వామి సీడ్స్‌ దుఖాణంలో శుక్రవారం అర్ధరాత్రి షాట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

Friday, August 10, 2018 - 14:19

ఆదిలాబాద్ : జిల్లాలో 'రిమ్స్' ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎన్నో లోటుపాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. కీలకమైన వైద్య శాలకు భారతీయ వైద్య మండలి షాక్ ఇచ్చింది. గుర్తింపు కొనసాగించడానికి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 22 అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. రెగ్యులర్ డీన్ లేరని..డీన్ ఉన్నా..ఆయన సరిగ్గా రాలేరని...ఉన్న ఫ్యాకల్టీ 35 శాతమేనని...దీనితో...

Tuesday, August 7, 2018 - 12:57

ఆదిలాబాద్‌ : రవాణా రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పేందుకు తీసుకువచ్చిన ఎమ్‌వీ యాక్ట్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆదిలాబాద్‌ బస్సు డిపో ముందు ఆందోళన చేశారు. వీరికి సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 6...

Thursday, August 2, 2018 - 18:42

ఆదిలాబాద్ : గత ప్రభుత్వాల తప్పిదం వల్ల, మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగజ్‌నగర్‌-చింతగూడ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పేపర్‌ మిల్లులో ప్రత్యేక పూజలు చేసి బహిరంగసభలో పాల్గొన్నారు. పేపర్‌ మిల్లు పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. జేకే పేపర్స్‌ అనే సంస్థ పేపర్‌ మిల్లు...

Thursday, August 2, 2018 - 16:53

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు లేకుండానే పేపర్‌ మిల్లు ముతపడిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని తెలిపారు. 

 

Thursday, August 2, 2018 - 16:49

ఆదిలాబాద్ : ఇంటింటికి తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 25  కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో 17.50 కోట్ల రూపాయలు బ్రిడ్జీల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలను...

Monday, July 30, 2018 - 12:25

ఆదిలాబాద్ : ఆగస్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు ప్రమాదం తప్పింది. మంత్రి జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి పార్టీ నేతలు..ఆసుపత్రి సిబ్బంది తాకిడి ఎక్కువగా ఉంది. వీరిలో కొంతమంది లిఫ్ట్ లో ఎక్కారు. ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. కింది ఎత్తులోనే లిఫ్ట్...

Friday, July 27, 2018 - 06:38

హైదరాబాద్ : రాహుల్‌ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో ఎంపీ స్థానాలు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో రెండు ఎంపీలను గెలిచిన హస్తం నేతలు... ఈసారి పరిస్థితి తమకు అనుకూలంగా ఉందంటున్నారు. ఇదే ఊపుతో దూసుకుపోతున్న హస్తం నేతలు... మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటామంటున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న దాంట్లో ఎంతమేరకు వాస్తవం ఉంది ? 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి...

Thursday, July 26, 2018 - 15:27

ఆదిలాబాద్ : ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ నియోజకవర్గ ప్రజలు తమదైన శైలీలో తీర్పునిస్తారు. గోడదూకే నేతల కంటే పార్టీలను నమ్ముకున్న అభ్యర్థులనే అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. అయితే ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ ప్రభావం తగ్గటంతో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? అక్కడ జరుగుతున్న రాజకీయ...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Saturday, July 14, 2018 - 12:54

ఆదిలాబాద్‌ : జిల్లాలో అధికార టీఆర్ఎస్‌ వర్గపోరుతో కుదేలవుతోంది. ఓ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ ఖానాపూర్‌ టికెట్‌ ఆశిస్తుండడంతో టీఆర్ఎస్‌ అధిష్టానం తలపట్టుకుంటోంది. దీంతో ఏ ఒక్కరికి టికెట్‌ ఇచ్చినా.. మరొకరు కారు దిగుతారన్న ప్రచారం సాగుతోంది. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ వర్గపోరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...
ఖానాపూర్ నియోజక వర్గం
ఖానాపూర్ నియోజక వర్గంలో అధికార...

Pages

Don't Miss