ఆదిలాబాద్
Thursday, January 11, 2018 - 09:13

నిర్మల్ : జిల్లా కడం మండలం నవాబ్‌ పేట్‌లో దారుణం వెలుగుచూసింది. కులాంత వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె అక్కను కులం నుంచి బహిష్కరించారు. కరీంనగర్‌కు చెందిన ముస్కె లత... మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కార్తీక్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. లత బెస్త కులానికి చెందిన అమ్మాయికాగా.... కార్తీక్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. లత అక్క జ్యోతి నిర్మల్...

Saturday, December 30, 2017 - 08:30

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ పేరు చెప్పగానే మనకు ఆదివాసీలు గుర్తుకు వస్తారు. ఇప్పుడైతే రికార్డ్‌ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇదే చలి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వబోతుంది. కాశ్మీర్‌లో ఉంటున్నట్లు చలి ఉండడమే కాదు.. అక్కడే పండే యాపిల్స్‌ ఇక్కడ పండబోతున్నాయి. త్వరలోనే మార్కెట్‌లోకి ఆదిలాబాద్‌ ఆపిల్స్‌ రాబోతున్నాయి. 
...

Thursday, December 28, 2017 - 21:30

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీ మాస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ, పేదలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, రైతు రుణమాఫీ డిమాండ్లతో పాటు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Tuesday, December 19, 2017 - 11:41

ఆదిలాబాద్ : జిల్లా ఏజెన్సీలో ఆదివాసీ వర్గానికి మరో వర్గానికి జరుగుతున్న వివాదంపై పరిశీలన చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఉట్నూరు ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించారు. ఆదివాసీలతో మాట్లాడారు. రెచ్చగొట్టేవారి ఉచ్చులో పడొద్దని ఐజీ నాగిరెడ్డి ఈ సందర్భంగా వారికి సూచించారు. అనంతరం పీఎస్‌కు వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా...

Friday, December 15, 2017 - 22:03

ఆదిలాబాద్ : జిల్లా హస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీలు లంబాడీల మధ్య ఘర్షణ జరిగింది. కొమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ ఉట్నూరులో ఆదివాసీలు ధర్నా చేశారు. తిరిగి వెళ్తున్న ఆదివాసీలపై హస్నాపూర్‌లో లంబాడీలు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...

Saturday, December 9, 2017 - 08:30

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలు, లంబాడా తెగల మధ్య వర్గపోరు చిచ్చురేపుతోంది. ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు రోజు రోజుకు శృతిమించుతోంది. వలస లంబాడాలపై ఆదివాసీల్లో వ్యతిరేక జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏకగ్రీవ తీర్మానాలతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వలస లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

తమ గ్రామాల్లో లంబాడా...

Thursday, December 7, 2017 - 06:30

ఆదిలాబాద్ : మరోసారి పత్తి రైతులు నిలువునా మోసపోయారు. పంట బాగా వస్తుందని నమ్మబలికితే.. కింగ్ రకం పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. పంట ఏపుగానే పెరిగింది... కానీ పూత, కాత మాత్రం రాలేదు. దీంతో.. ఆందోళన చెందిన రైతులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే... పంట వస్తుందని ఉచిత సలహాలు ఇచ్చారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడతో రైతన్నలు పత్తి...

Wednesday, December 6, 2017 - 15:49

అదిలాబాద్‌ : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని బట్టిసావర్గం వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం టోలర్స్‌ కాలనీకి చెందిన కల్యాణి (21), బట్టసావర్గం దుబాగుడకు చెందిన ముకేష్‌ (25)లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. 

 

Wednesday, December 6, 2017 - 13:25

Pages

Don't Miss