ఆదిలాబాద్
Tuesday, November 24, 2015 - 18:45

ఆదిలాబాద్‌ : నాసిరకం భోజనం పెడుతున్నారంటూ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లోని బీసీ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌ గదులను శుభ్రపరచడంలేదని మండిపడ్డారు. దొడ్డు బియ్యం, నీళ్లచారు, కుళ్లిన అరటిపండ్లను ఇస్తున్నారని ఆరోపించారు.. ఈ వస్తువులతో ఆర్ డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ఆర్డీవో... బీసీ వెల్ఫేర్ అధికారి నర్సారెడ్డితో ఈ అంశంపై మాట్లాడారు.....

Monday, November 23, 2015 - 20:28

ఆదిలాబాద్‌ : బెజ్జూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో దెయ్యం భయంతో విద్యార్థినిలు వణికిపోతున్నారు. 3 రోజులక్రితం జ్వరంతో మమత అనే విద్యార్థిని మృతి చెందింది. తోటి విద్యార్థిని మృతితో అందరూ టెన్షన్‌ పడుతున్నారు. చనిపోయేముందు మమత వింతగా ప్రవర్తించారు. ఆమె దయ్యం పట్టినట్లు ప్రవర్తించడంతో విద్యార్థినిలు అంతా వణికిపోయారు. హాస్టల్ లో దయ్యం ఉందంటూ విద్యార్థినిలు వణికిపోతున్నారు. దాదాపు...

Sunday, November 22, 2015 - 20:57

ఆదిలాబాద్ : జిల్లాలో మావోయిస్టు బక్కన్నను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 9 ఎంఎం తుపాకీ,3 రౌండ్ల బుల్లెట్లను బెల్లంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండు ఇన్ ఫార్మర్ల హత్యకేసులో బక్కన్న నిందితుడు : ఎస్పీ
రెండు ఇన్ ఫార్మర్ల హత్య కేసులో మావోయిస్టు బక్కన్న నిందితుడని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ తరుణ్ జోషి తెలిపారు. ఖానాపూర్ ఎదురుకాల్పుల సమయంలో...

Sunday, November 22, 2015 - 19:26

ఆదిలాబాద్ : క్రికెట్‌ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణానికి చెందిన నోమన్‌, అబ్బు సోఫియన్‌లో క్రికెట్‌ ఆడుతుండగా పక్కనే ఉన్న చెరువులో బాల్‌ పడింది. దీంతో నోమన్‌, అబ్బు సోఫియన్‌లు బాల్‌ కోసం చెరువులోకి దిగగా ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు వెలికితీసి...

Saturday, November 21, 2015 - 07:26

ఆదిలాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలి..వేతనాలు పెంచాలని గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పలు జిల్లాల్లో ఆశా వర్కర్లు ఆందోళనను ఉధృతం చేశారు. ఆదిలాబాద్ జిల్లాల్లో దీక్ష చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరహార దీక్ష చేపట్టిన ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీక్షా టెంట్ ను...

Thursday, November 19, 2015 - 18:42

ఆదిలాబాద్‌ : జిల్లాలో ఆశ కార్యకర్తల సమ్మె ఉధృతంగా సాగుతోంది. గత రెండు నెలలుగా సమ్మెచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు దీక్ష ఆపబోమని ఆశా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. 

Thursday, November 19, 2015 - 07:21

ఆదిలాబాద్‌ : జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. పెంబీ అటవీ ప్రాంతంలో ఇంద్రవెల్లి దళానికి చెందిన 25 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు...

Monday, November 9, 2015 - 06:35

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ, తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారనుంది. ఈ తుపానుకు రోవానుగా నామకరణం చేస్తూ ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.

సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం..
రోవాను తుపాను సోమవారం అర్ధరాత్రికి...

Saturday, November 7, 2015 - 12:43

ఆదిలాబాద్ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. దిలావర్‌పూర్‌కుచెందిన సాయారెడ్డి వ్యవసాయం చేసి చాలా నష్టపోయాడు.. బతుకుతెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు.. అక్కడ జీతం సరిగా రాకపోవడంతో తిరిగి సొంతూరుకువచ్చాడు.. తనపొలంతోపాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశాడు.. అయినా ఆశించిన స్థాయిలో దిగుబడిరాక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. 

Friday, November 6, 2015 - 13:20

హైదరాబాద్ : ఆదిలాబాద్‌లో రైతులు చేతులకు సంకెళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. మార్కెట్‌ యార్డులో ఆందోళన చేపట్టిన రైతుల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. పోలీసులతో విచారణ జరిపించి కేసులు ఎత్తివేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. 

Wednesday, November 4, 2015 - 14:57

ఆదిలాబాద్ : పత్తి మార్కెట్‌ దాడి ఘటనపై పోలీసులు సీరియస్‌ అయ్యారు.. రాళ్లు రువ్విన ఒక్కో రైతుపై కేసులు పెడుతున్నారు.. ఇప్పటికే 50మందిపై కేసులు నమోదుచేశారు.. మంగళవారం రాత్రి నలుగురిని అరెస్ట్ చేశారు.. మరో ఇద్దరిని మార్కెట్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈ అరెస్టులపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.. 

Pages

Don't Miss