ఆదిలాబాద్
Thursday, July 5, 2018 - 11:18

మంచిర్యాల : జిల్లాలో బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ పసుల సునీతారాణిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు...ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలపడం చర్చనీయాంశమైంది. కౌన్సిల్‌లోని మరోవర్గం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలనే పట్టుదలను ప్రదర్శిస్తుండగా అవిశ్వాసం వీగాలని...

Thursday, July 5, 2018 - 10:18

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా...అతి పెద్ద మున్సిపాల్టీగా బెల్లంపల్లి ఉంది. మున్సిపాల్టీలో అధికార పార్టీకి అసమ్మతి బెడద పెరిగిపోతోంది. బెల్లంపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలుపుతూ ఛైర్ పర్సన్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ఇందుకు వ్యూహాలు రచించినట్లు...

Wednesday, July 4, 2018 - 06:36

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకోవటంతో తెలంగాణలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. 8 నెలలుగా నీరులేక దర్శనమిస్తున్న శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి గోదావరి ఉరకలు వేస్తుంది. దీంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ...

Friday, June 29, 2018 - 20:15

కొమరం భీం : ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్న భోజనంలో తోటకూర పప్పు తిన్నారు. తిన్న 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వాంకిడి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందించేందుకు సరియైన ఏర్పాట్లు లేకపోవడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థులకు...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Monday, June 18, 2018 - 13:26

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. మిగులు భూముల జోలికి అధికారులు రాకూడదని 2008లో...

Friday, June 15, 2018 - 16:17

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. ఇరు రాష్ర్టాల్లో పరిస్థితులను హోంమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగున్నరకు గవర్నర్‌ ప్రధాని మోదీని కలవనున్నారు.

Tuesday, June 12, 2018 - 19:39

ఆదిలాబాద్ : ఇప్పటివరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కబ్జాదారులు మాత్రమే భూములను ఆక్రమించుకోవడం చూశాం. కాని ఓ పేదోడి స్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి కబ్జా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. బాధితుడికే భూమి చెందాలన్న కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దర్జాగా భూమిని కబ్జా చేసేశారు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడు...

Monday, June 11, 2018 - 18:48

అదిలాబాద్‌ : జిల్లాలోని పలు ప్రాంతాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. సుశ్మీర్‌ గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మావల, గుడిహత్నూర్‌, తలమడుగు, తాంసి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన ఈ భారీ వర్షం కురిసింది. జిల్లాలోని పలు కేంద్రలో రోడ్లు జలమాయం అవగా..... ఈదులు గాలులకు పూరి గుడిసెల పైకప్పులు...

Wednesday, June 6, 2018 - 15:33

ఆదిలాబాద్ : స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణ శాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రైవర్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ శ్యామ్ నాయక్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని...

Pages

Don't Miss