ఆదిలాబాద్
Friday, December 11, 2015 - 14:21

హైదరాబద్ : మండలి ఎన్నికలను అధికార పక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 స్థానాల్లో విజయం సాధిస్తామని గులాబీ నేతలు మొదటి నుండి ధీమాను వ్యక్త పరుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కో స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. గురువారం వరంగల్ లో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్ లు...

Friday, December 11, 2015 - 13:37

ఆదిలాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎత్తులు ఫలిస్తున్నాయి. నిన్న వరంగల్‌ అయితే ఇవాళ ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ ఏకగ్రీవమైంది. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ బరి నుంచి టీడీపీ, సతంత్ర అభ్యర్థులు తప్పుకున్నారు. దీంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పురాణం సతీష్‌ ఏకగ్రీవమయ్యారు.

Friday, December 11, 2015 - 10:45

ఆదిలాబాద్ : మాదారం మదన పడుతోంది. 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోలేక సతమతమై పోతోంది. ఇక్కడి 400 కుటుంబాలు అంధకారమైన తమ భవిష్యత్తుపై బెంగ పడుతున్నాయి. సింగరేణి సంస్థ నిర్ణయం.. మాదారం ప్రజల్లో అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. ఇంతకీ సింగరేణి తీసుకున్న నిర్ణయం ఏంటి..? మాదారంపై దాని ప్రభావమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

శ్మశాన నిశ్శబ్దంతో.. భోరు మంటోంది. ...

...

Thursday, December 10, 2015 - 21:28

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమ సమ్మె వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. వంద కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.. ఆశాలు. ఆశా వర్కర్లు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రం నలుమూలలా...

Wednesday, December 9, 2015 - 14:22

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీటీడీపీ తరపున ఐదుగురిని పోటీలో నిలిపారు. మహబూబ్‌నగర్‌ నుంచి కొత్తకోట దయాకర్‌ రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి బుక్కా వేణుగోపాల్‌, కరీంనగర్‌ నుంచి కర్రు నాగయ్య, నల్గొండ నుంచి సాదినేని శ్రీనివాసరావులు బరిలో నిలిచారు. కాగా ఖమ్మంలో సీపీఐకి టీడీపీ మద్దతు ఇవ్వనుంది. వరంగల్‌లో ఎంపీటీసీలు నిలబెట్టిన...

Saturday, December 5, 2015 - 21:01

హైదరాబాద్: 2016 సంవత్సరానికిగానూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవులను ప్రకటించింది. మొత్తం 44 రోజుల సెలవు దినాలలో 23 సాధారణ సెలవులు కాగా, 21 ఐచ్ఛిక సెలవులున్నాయి. ఈ మేరకు శనివారం ఉత్వర్వులు జారీ చేసింది.
జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 26న గణతంత్ర దినోత్సవం, మార్చి 7న మహాశివరాత్రి, 23న హోలీ, 25న గుడ్‌ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రాం జయంతి, 8న ఉగాది, 14న అంబేద్కర్ జయంతి...

Friday, December 4, 2015 - 12:37

ఆదిలాబాద్ : జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో రివ్యూ సమావేశం జరిగింది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులపై మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరారవు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షలో చర్చించారు. త్వరలో కేసీఆర్ జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. 

Wednesday, December 2, 2015 - 12:32

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. 12 శాసనమండలి సభ్యుల ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ ను అధికారులు జారీ చేశారు. స్థానిక సంస్థల కోటాలో సభ్యులు ఖాళీల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12 స్థానాలున్నాయి. ఆదిలాబాద్ -1, నిజామాబాద్ -1, మెదక్ -1, నల్గొండ -1, వరంగల్ -1, ఖమ్మం -1, కరీంనగర్ -2, రంగారెడ్డి -2, మహబూబ్ నగర్...

Wednesday, December 2, 2015 - 06:30

హైదరాబాద్ : స్థానిక సంస్థల మండలి ఎన్నికలకు తెరలేచింది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్దం చేసింది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ కోసం నవంబర్ నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. కాగా బుధవారం నాడు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 12...

Thursday, November 26, 2015 - 18:38

ఆదిలాబాద్ : ఇంట్లో పనులు చేసి చేసి బోర్‌కొట్టిందో..లేక... ఎప్పుడూ లైఫ్‌ ఇంతేనా అనుకుందో...కిక్‌ ఉండాలనుకుందో...మొత్తానికి ఓ లేడి రాత్రి రాత్రి అమ్మవారి అవతారం ఎత్తేసింది..తనకు తాను దేవతనని చెప్పింది. అప్పటిదాకా ఆమె అంట్లు తోమేప్పుడు ఇల్లు ఊడ్చేప్పుడు చూసినవారు కూడా బొక్కబోర్లా పడ్డారు. ఆమె ఊగడం చూసి తన్మయత్వంతో వారూ ఊగిపోయారు. ఆమె మాటలకు పొర్లు దండాలు పెట్టేశారు. ఏకంగా జాతరనే...

Wednesday, November 25, 2015 - 13:31

ఆదిలాబాద్ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతమిది. అడవుల జిల్లాగా పేరుగాంచిన వెనుకబడిన జిల్లా ఇది. ఇక పల్లెలో అభివృద్ధి ఊసే ఉండదు. అలాంటి ప్రాంతంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కోడి పందాలను, పందెం కోళ్లను సినిమాల్లోనే తప్పా నేరుగా చూడని అడవిలో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పండగకో..పబ్బానికో కాదు ఏడాది పొడవునా ఆదిలాబాద్‌ జిల్లాలో కోడిపందాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్...

Pages

Don't Miss