ఆదిలాబాద్
Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Saturday, June 2, 2018 - 07:54

ఆదిలాబాద్ : తెలంగాణలో ఆదివాసీలు సమర శంఖం పూరిస్తున్నారు.. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా.. స్వయం పాలన ప్రకటించుకోవాలని  నిర్ణయించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు ఉధృతంగా ఉద్యమిస్తామంటూ.. ఆదీవాసీలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆదివాసీల నిరసన గళం...

Friday, June 1, 2018 - 21:27

హైదరాబాద్ : లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు ఉద్యమబాట పట్టనున్నారు. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్వయం పాలన ప్రకటించుకొని నిరసన తెలపనున్నారు. మా ఊరిలో మా రాజ్యం నినాదంతో ఆదివాసీలు సమరశంఖం పూరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసీలు ఈ నిరసనలో పాల్గొననున్నారు. లంబాడీలను ఎస్టీ...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Sunday, May 13, 2018 - 09:12

ఆదిలాబాద్ : ఎక్కడ వర్షం పడుతుందో...కష్టపడి..చెమటోడ్చి పండిన పంట నీళ్ల పాలవుతుందో..తమకు ఎక్కడ నష్టం వస్తుందో..అని ధాన్యం వద్ద కాపలా ఉన్న రైతుల పాలిట 'పిడుగు' శాపంగా పరిగణించింది. పిడుగు పడి ముగ్గురు రైతులు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు అధికారులు సరైన చర్యలు...

Saturday, May 5, 2018 - 18:44

ఆదిలాబాద్‌ : గుడిహత్నుర్‌ మండలం గోపాల్‌పూర్‌లో.. క్యాంపు ఆఫీస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ పెళ్లి వేడుకలో జిల్లా కలెక్టర్ దివ్య పాల్గొన్నారు. ఈ పెళ్లిలో కలెక్టర్ గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అటెండర్‌, తోటమాలిగా పనిచేస్తున్న నైతం సుధాకర్‌.. తన పెళ్లికి రావాలని కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక ఇవ్వడంతో కలెక్టర్ దివ్య...

Tuesday, May 1, 2018 - 12:53

ఆదిలాబాద్‌ : జిల్లాలో కార్మికులు మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలుచోట్ల ఎర్రజెండాలను ఎగురవేశారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గుగని కార్మికులు జెండాలు ఎగురవేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను... ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు.  కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా...

Saturday, April 28, 2018 - 16:26

కాసిపేట మండల కేంద్రంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాక్షిగా ఎంపీపీ శంకరమ్మ బోరున విలపించింది. సర్వ సభ్య సమావేశంలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. కేవలం దళిత మహిళను అనే కారణంగా నాలుగేండ్లుగా తనను చులకన భావంతో అవహేళన చేస్తున్నారంటూ సభ నుండి వాకౌట్ చేసింది.అధికార పార్టీకి చెందిన ఎంపీపీ సభలో అసంతృప్తిని వెల్లగక్కడంతో సభ సభ్యులంతా ఒక్కసారిగా...

Tuesday, April 24, 2018 - 13:42

ఆదిలాబాద్‌ : జిల్లాలోని ఏజెన్సీప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవి ప్రారంభంలోనే... గిరిజనానికి చెలిమల నీరే దిక్కైంది.  గుక్కెడు మంచినీటి కోసం గిరి గ్రామాలు... పుట్టెడు కష్టాలు పడుతున్నాయి.  బిందెడు నీటికోసం మహిళలు మైళ్లదూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రజల నీటికష్టాలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పచ్చని అడవి అందాలకు...

Monday, April 16, 2018 - 19:53

ఆదిలాబాద్‌ : ఎమ్మెల్యే తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో సమస్యలన్నీ తీరి అభివృద్ధి చెందుతుందని భావించారు గ్రామస్తులు. కానీ, నాలుగేళ్లు గడిచినా కనీసం ఎమ్మెల్యే గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గంలోని తేజాపూర్‌ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధే తప్ప ఇంతవరకు జరిగిందేమీ లేదంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Pages

Don't Miss