ఆదిలాబాద్
Monday, September 25, 2017 - 07:21

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. కార్మిక సంఘాలు గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు చిత్రమైన పొత్తులు, అసాధారణ ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్‌ 5వ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆయా సంఘాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా మారిపోయాయి. గతంలో...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Saturday, September 23, 2017 - 16:35

ఆదిలాబాద్‌ : జిల్లా గుడిహత్నూర్‌ మండలం కొలామ్‌లో దారుణం జరిగింది.. గ్రామ శివారులో మడావి సునీత అనే వివాహితను టేకం గోవింద్‌ రావ్ అనే యువకుడు హత్య చేశాడు.. హత్య తర్వాత తానుకూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tuesday, September 19, 2017 - 17:51

ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో అత్యంత ప్రధానమైనది. పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని, డబ్బా ఇళ్ల నుంచి విముక్తి కల్పిస్తామని కేసీఆర్‌ హామీనిచ్చారు. ప్రతి పేదవాడూ ఆత్మగౌరవంగా బతికేందుకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా... రాష్ట్ర...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Sunday, September 17, 2017 - 10:00

మంచిర్యాల : జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా చేరుతున్న వరద నీటితో ప్రాజెక్టు నీటిమట్టం 146 అడుగులకు చేరింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. మరింత సమాచారం వీడియోలో చూడండి.. 

Friday, September 15, 2017 - 15:52

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం ఏడు వందల అడుగులైతే.. ప్రస్తుత నీటి మట్టం 699 అడుగులలో ఉంది. జిల్లాలో బోథ్‌, నేరేడిగొండ, కుంటల, ఇంద్రవెళ్లి మండలాల్లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కడెం జలాశయంలోకి ఇన్‌ ఫ్లో 52 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇరిగేషన్‌...

Monday, September 11, 2017 - 17:11

ఆదిలాబాద్ : జిల్లాలో కొనసాగుతున్న తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్రలో టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఉట్నూర్‌లో అంబేద్కర్‌, తెలంగాణ అమరవీరుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన.. రైతు సమన్వయ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప.. ఆ కమిటీలతో ఒరిగేదేమీ లేదన్నారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని...

Monday, September 11, 2017 - 12:09

ఆదిలాబాద్ : మూడేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను జేఏసితో చెప్పుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో సమస్యలు తమ దృష్టికి...

Sunday, September 10, 2017 - 17:51

ఆదిలాబాద్/నిర్మల్ : రైతుల వికాసం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా, బైంసా డివిజన్‌లోని కుబీర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ కమిటీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతును తలెత్తుకొని తరిగేవిధంగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని దాన్ని...

Pages

Don't Miss