ఆదిలాబాద్
Thursday, March 9, 2017 - 17:35

ఆదిలాబాద్‌ : నగరంలోని శ్రీరామ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం స్థానికులను టెన్షన్‌ పెట్టింది.. ఫ్యాక్టరీలో పత్తి నిలువకు అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది ఈ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే ఐదు క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. మరో నాలుగు క్వింటాళ్ల పత్తికి కూడా నష్టం సంభవించింది.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

Sunday, March 5, 2017 - 18:37

ఆదిలాబాద్ : పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డ్‌కు వెళ్తున్న కంది రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అధికారులు, వ్యాపారులు కుమ్మకై రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కంది రైతులు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం.. 
రైతుల కష్టాన్ని జలగలా పీల్చేస్తున్న దళారులు 
ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్....

Thursday, March 2, 2017 - 11:50

హైదరాబాద్ : మార్చి మొదట్లోనే ఎండలు మండుతున్నాయి. ఎండలకు చెలిమల్లో నీరు కూడా ఎండి తాగునీటికి తంటాలు పడుతున్నారు గిరిజనులు. గత వర్షాలకు వాగులు, వంకలు నిండినా.. అవన్నీ ఎండిపోయి చెలిమల్లోని కలుషిత నీరే గిరిజనులకు తాగునీరవుతోంది. ప్రభుత్వం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా.. నీటి సమస్య మాత్రం శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. గుక్కెడు తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు పుట్టెడు...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Saturday, February 25, 2017 - 18:39

ఆదిలాబాద్: ఇది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ గ్రామం. ఒక్కప్పుడు సంతోషంగా ఉన్న ఇక్కడి ప్రజలను కిడ్నీ వ్యాధి కాటికి పంపిస్తోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు పాతిక మందిని పొట్టన పెట్టుకుంది. మరో ఇరవై మంది కిడ్నీ వ్యాధితో నరకం చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికి అదే సమస్య. ఇంకొందరిదైతే తమకు వచ్చిన రోగమేమిటో తెలియని...

Saturday, February 25, 2017 - 16:25

 

హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా శంఖు:స్థాపన చేసిన మందాకిని కాలువలో తట్టమట్టి తీసినవారు లేరు. కొన్నింటిని ఇలా శంఖు:స్థాపనలు చేశారు. మరికొన్ని చోట్ల ప్రాజెక్టు కట్టి కాలువలు తవ్వకుండా వదిలేశారు. అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో...

Friday, February 24, 2017 - 17:17

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అప్ర్పుడే ఎండలు మండిపోతున్నాయి. శివరాత్రికి చలి శివ..శివ అంటూ వెళ్లిపోతుందని అనంతరం ఎండలు మెల్లిగా అధికమౌతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 26-31 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఫిబ్రవరి నెలాఖరులో పరిస్థితి ఈ...

Tuesday, February 14, 2017 - 17:14

ఆదిలాబాద్ : దశాబ్దాల పోరాటం తర్వాత ఆదివాసీలు సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం కాలరాస్తోంది. జల్‌ జమీన్‌, జంగిల్‌ కోసం  పోరాడిన నేలపై .. భూమిహక్కులు హరించబడుతున్నాయి. అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి అటవీశాఖ ఆదివాసీ గ్రామాలపై దండయాత్రలు చేస్తోంది. హరిత హారం పేరుతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడుతున్నారు. వామపక్షాల...

Monday, January 30, 2017 - 14:57

Pages

Don't Miss