ఆదిలాబాద్
Wednesday, January 17, 2018 - 09:07

ఆదిలాబాద్‌ : జిల్లాలో నాగోబా జాతర కోలాహలంగా సాగుతోంది. నాలుగు రాష్ట్రా నుంచి తరలి వచ్చిన గిరిజనులు తమ ఆరాధ్యదైవం నాగోబాకు భక్తి శ్రద్ధలో పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ వాయిద్యాలతో నాగోబాకు ఘనంగా పూజలు జరుగుతున్నాయి.ప్రతిఏటా పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. పకృతితో పెనవేసుకున్న ఆదివాశీల సంస్కృతికి అసలు సిసలు ప్రతిరూపం ఈ నాగోబా...

Monday, January 15, 2018 - 16:50

ఆదిలాబాద్ : జిల్లాలోని కొమ్రంభీ జిల్లాలో టీ మాస్ నేతలు పర్యటించారు. జిల్లా కేంద్రంలోని వరలక్ష్మీనగర్ లో నెలకొన్న సమస్యలను స్థానికులు నేతలకు వివరించారు. మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, 20 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. నేటికి విద్యుత్, నీటి సదుపాయం లేకుండా గోండులు నివాసం ఉంటున్నారని టీ మాస్ నేతలు పేర్కొన్నారు. వెంటనే సమస్యలు...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Sunday, January 14, 2018 - 07:44

ఆదిలాబాద్ : సంక్రాంతి పండుగంటే ఏపీలో కోడి పందేలు ఫేమస్‌. వివిధ రకాల పిండి పదార్థాలూ చేస్తారు. మరి సంక్రాంతి పండుగకు నిర్మల్‌ జిల్లా భైంసాకూ ఓ ప్రత్యేకత ఉంది.  తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా దొరకని స్వీట్‌ భైంసా పట్టణంలోని మిఠాయి దుకాణాల్లో లభ్యమవుతుంది. ఆ స్వీటునే గేవర్‌ అంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గేవర్‌ అమ్మకాలు ఊపందుకుంటాయి.  మైదాపిండితో స్వచ్ఛమైన నెయ్యి, పాలు...

Saturday, January 13, 2018 - 17:52

ఆదిలాబాద్ : జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా.. తమ కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పర్యటించిన టీమాస్‌ బృందంతో గాంధీనగర్‌ కాలనీ వాసులు తెలియచేశారు. కనీస అవసరాలైన మరుగుదొడ్లు, మురికి కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీలోకి కనీసం 108 వాహనం రావడానికి కూడా సరైన రోడ్లు లేవని వాపోయారు. సమస్యల వలయంగా ఉన్న గాంధీనగర్‌...

Thursday, January 11, 2018 - 09:13

నిర్మల్ : జిల్లా కడం మండలం నవాబ్‌ పేట్‌లో దారుణం వెలుగుచూసింది. కులాంత వివాహం చేసుకుందన్న కక్షతో ఆమె అక్కను కులం నుంచి బహిష్కరించారు. కరీంనగర్‌కు చెందిన ముస్కె లత... మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కార్తీక్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. లత బెస్త కులానికి చెందిన అమ్మాయికాగా.... కార్తీక్‌ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. లత అక్క జ్యోతి నిర్మల్...

Saturday, December 30, 2017 - 08:30

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ పేరు చెప్పగానే మనకు ఆదివాసీలు గుర్తుకు వస్తారు. ఇప్పుడైతే రికార్డ్‌ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇదే చలి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వబోతుంది. కాశ్మీర్‌లో ఉంటున్నట్లు చలి ఉండడమే కాదు.. అక్కడే పండే యాపిల్స్‌ ఇక్కడ పండబోతున్నాయి. త్వరలోనే మార్కెట్‌లోకి ఆదిలాబాద్‌ ఆపిల్స్‌ రాబోతున్నాయి. 
...

Thursday, December 28, 2017 - 21:30

ఆదిలాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన టీ మాస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ, పేదలకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, రైతు రుణమాఫీ డిమాండ్లతో పాటు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని...

Pages

Don't Miss