అనంతపురం
Sunday, April 30, 2017 - 21:30

అనంతపురం : తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన చైతన్య స్వరూపి వేమనపై అనంతపురంలో సాహిత్య సమాలోచన కార్యక్రమం ఘనంగా జరిగింది. 250 సంస్థల ఆధ్వర్యంలో మేధావులు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ వేత్తలు, కవులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కుల వ్యవస్థ, అవినీతి అక్రమాలు, శ్రమదోపిడీ చెలరేగిపోతున్న నేటి సమయంలో వేమన సందేశం మనకు ఎంతో అవసరమని సాహితీ ప్రియులు...

Sunday, April 30, 2017 - 21:28

అనంతపురం : రైతుల్ని రెచ్చగొట్టడానికే జగన్ గుంటూరులో రైతు దీక్ష చేస్తున్నాడని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్  రెడ్డి విమర్శించారు. సొంత మీడియాను, మనుషులను వాడుకుంటూ కావాలని హడావిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు తమ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందో జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ రద్దైతే సంబరాలు జరుపుకోవడం కాదని.. సిబిఐ 11 కేసుల్లో నిర్దోషిగా బయటపడితే అప్పుడు...

Saturday, April 29, 2017 - 16:04

అనంతపురం : జిల్లాలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. మూడు నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో కరువుతో అల్లాడిపోతున్నారు. కూలిడబ్బులకోసం అధికారులు చుట్టూ తిరిగి  విసుగెత్తిపోతున్నారు. మండిపోతున్న ఎండలల్లో పనిచేస్తున్నా.. పాలకులు కరుణించడంల లేదని  ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.  
వలసబాటలో అనంత ప్రజలు
అనంపురంజిల్లా ప్రజలు మరోసారి...

Saturday, April 29, 2017 - 15:32

అనంతపురం : తెప్ప బోల్తా ఘటనలో ప్రాణాలు విడిచిన మృతుల కుటుంబాలను మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  మృతుల కుటుంబాలకు పిల్లలకు లక్ష రూపాయలు, పెద్ద వాళ్లకు మూడు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. మంత్రులు కాలువ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌.. కూడా బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరపు అన్ని విధాల సహాయం అందిస్తామని మంత్రి...

Saturday, April 29, 2017 - 12:02

హైదరాబాద్ : అనంతపురం తెప్ప బోల్తా మృతులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. 13 మంది ప్రాణాలు కోల్పోడం బాధకరమని అన్నారు. గుండెలు పిండేసే విధంగా ప్రమాద దృశ్యాలు ఉన్నాయని తెలిపారు. ఇకనైన ప్రజాప్రతినిధులు మేల్కోవాలని ఆయన సూచించారు. ఇలాంటి విషాధ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

 

Saturday, April 29, 2017 - 09:48

అనంతపురం : జిల్లాలోని గుంతకల్ మండలం వైటి చెరువులో తెప్ప మునక దుర్ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఐదేళ్ల చిన్నారి శివగా గుర్తించారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. శుక్రవారం సాయంత్రం రామచంద్రయ్య అనే వ్యక్తి తన తోబుట్టువులతో కలిసి ప్రయాణిస్తూండగా ఈ సంఘన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో తెప్పలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

 

Friday, April 28, 2017 - 21:58

అనంతపురం : జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువులో విషాదం చోటు చేసుకుంది. విహరయాత్ర విషాదయాత్రగా మారింది. తెప్ప బోల్తా పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 19 మంది ఉన్నారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నారు.  విషయం తెలుసుకున్న గ్రామస్థులు .....

Friday, April 28, 2017 - 21:15

అనంతపురం : విహారయాత్ర విషాదయాత్రగా మారింది. చెరువులో బోటు బోల్తా పడడంతో 11 మంది మృతి చెందారు. 16 మంది విహార యాత్రకు వెళ్లారు. జిల్లాలోని గుంతకల్లు మండలం వైటీ చెరువులో బోటులో 16 మంది వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. దీంతో బోటులోని 11 మంది మృతి చెందారు. గల్లంతైన మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 

...
Thursday, April 27, 2017 - 18:04

అనంతపురం :  క్రమశిక్షణకు మారుపేరు ఆయన టీడీపీలో రోజురోజుకు కుమ్మూలటాలు పెరగుతున్నాయి. తాజాగా జిల్లాలో తెలుగుతమ్ముళ్లు బాహబాహికీ దిగారు. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు మస్తానయ్య, రామాంజనేయులు చెప్పులతో కొట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సమక్షంలోనే గొడవ జరిగింది. 

Thursday, April 27, 2017 - 12:28

అమరావతి : దక్షిణ కొరియా దిగ్గజ కార్ల సంస్థ కియా మోటార్స్‌ ప్రతినిధులు...సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఇందుకోసం 600 ఎకరాల స్థలం గుర్తించింది. దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడితో ఈ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు....

Pages

Don't Miss