అనంతపురం
Wednesday, November 15, 2017 - 13:38

అనంతపురం : అనంత రాజకీయాలు నవ శకానికి నాంది కాబోతున్నాయి. రానున్న ఎన్నికలే లక్ష్యంగా నేతల తనయులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇంత కాలం తండ్రి చాటు బిడ్డలుగా ఉంటూ తండ్రుల అధికారంలో పరోక్ష పాలన సాగిస్తూ వచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో ప్రతీ ఒక్కరినీ కలుసుకుంటూ రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్న.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డితో టెన్...

Wednesday, November 15, 2017 - 11:58

అనంతపురం : జిల్లా గుత్తి మండలం పెదొడ్డిలో ఘర్షణ జరిగింది. పొలంలో దారి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. రవి, శ్రీకాంత్ లపై బాబు అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, November 15, 2017 - 10:53

అనంతపురం : నగరంలో దారుణం జరిగింది. 22 ఏళ్ల షణ్ముఖ తన మామ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 16 ఏళ్ల మైనర్‌పై 10 రోజులుగా అత్యాచారం చేస్తుండటంతో బాలిక తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి షణ్ముఖను అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖపై కేసు నమోదైంది. వైద్య పరీక్షల కోసం బాలికను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రాజకీయ పలుకుబడితో...

Sunday, November 12, 2017 - 08:25

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా..భూ కబ్జా దారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని అనంతపురం కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేర్కొన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ఖాళీ స్థలాల్లో గదులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని..ఫంక్షన్ హాల్ నిర్మించి లీజుకు ఇవ్వాలని కోరారు. దీనివల్ల ఆర్టీసీకి లాభాలు వస్తాయని..ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా...

Wednesday, November 8, 2017 - 09:51

అనంతపురం : జిల్లా ప్రజలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జ్వరపీడితులతో వార్డులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక పలువురు రోగులు మృత్యువాత పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో జ్వరాలు విజృభించాయి. రోజు, రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కుటుంబాలకు, కుటుంబాలే...

Monday, November 6, 2017 - 14:47

అనంతపురం : సినీహీరో శ్రీకాంత్‌ సందడిచేశారు. పట్టణంలో డాక్టర్‌కేర్ హోమియోపతి సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో వైద్యంలో చక్కని పరిష్కారం ఉందన్నారు శ్రీకాంత్‌. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా వైద్యం అందించడం హోమియో మందుల ప్రత్యేకత అన్నారు. హోమియో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే తాము తెలుగు రాష్ట్రాల్లో పలు క్లినిక్‌లు ప్రారంభించినట్టు డాక్టర్‌...

Monday, November 6, 2017 - 08:46

అనంతపురం : సినీతారల క్రికెట్‌ సందడికి వేదికైంది అనంతపురంలోని పిటిసి మైదానం. క్రిసెంట్‌ క్రికెట్‌ కప్‌ పేరుతో నిర్వహించిన ఈ పోటీలో సినీ నటులు, శ్రీకాంత్‌, తరుణ్‌ టీంలు పాల్గొన్నారు. క్రికెట్‌ పోటీలను మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతలో ఇలాంటి క్రికెట్‌ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని సినీ తారలు అన్నారు.

 

Pages

Don't Miss