అనంతపురం
Friday, December 1, 2017 - 09:18

అనంతపురం : అనంత సాగు,తాగు నీటి అవసరాలకు ఆ జలాశయం ఆయువు పట్టు. పాలకుల ఆనాలోచిత నిర్ణయాలు, కాంట్రాక్టర్ల అవినీతి, అక్రమాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వాలు మారిన విధంగానే పాలకుల నిర్ణయాలు మారుతుండటంతో  ఆ జలాశయానికి శాపంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచే వేసిన తప్పటడుగులు..నిర్మాణ లోపాలు,  అవినీతి, అక్రమాలు వెరసి అనంత రైతన్న నోట్లో మట్టి కొడుతున్నాయి. లీకేజీల...

Friday, December 1, 2017 - 09:15

అనంతపురం : సమృద్ధిగా సాగునీటి నిల్వలు...భారీ వర్షాలతో కళకళలాడుతున్న జలాశయాలు, చెరువులు అయినా చెరువులకు నీటి విడుదలలో అనంత నాయకులు నీటి రాజకీయాలు. తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమంటూ జలవనరులశాఖ అధికారులపై వత్తిడితో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు కరువుతో అల్లాడిన అనంత రైతన్నకు ఇప్పుడు నీటి విడుదలలో రాజకీయాలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ...

Thursday, November 30, 2017 - 09:22

అనంతపురం : జిల్లాలోని గుట్టూరు వద్ద టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

 

Wednesday, November 29, 2017 - 19:58

అనంతపురం : రాష్ట్ర పోలీసు క్రీడా పోటీలకు అనంతపురం జిల్లా వేదికవుతోంది. నాలుగేళ్లగా వాయిదా పడుతున్న రాష్ట్ర పోలీసు క్రీడా పోటీలను అనంతపురం జిల్లాలో నిర్వహించేందుకు  రాష్ట్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంది. వచ్చె నెల 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీసు డీజీపీ సాంబశివరావు హజరవుతున్నారని, ముగింపు, బహుమతుల ప్రదానోత్సవ...

Wednesday, November 29, 2017 - 16:36

అనంతపురం : మరో విద్యాకుసుమం రాలిపోయింది. రుద్రంపేటలోని సివి రామన్ కాలేజీ హాస్టల్‌ లో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామగిరి మండలం వెంకటాపురంకు చెందిన లక్ష్మిదేవి కూతురు శ్రావణి అనంతపురం రుద్రంపేటలోని సివి రామన్‌ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తలనొప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొందని కాలేజీ యాజమాన్యం చెబుతుంటే.. తన కూతురిని హత్య చేశారని పేరెంట్స్‌...

Wednesday, November 29, 2017 - 15:43

అనంతపురం : మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి ఆకర్శితులమయ్యే పార్టీలో చేరుతున్నామని గురునాథ్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కొత్త రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అభివృద్ధికి దోహదపడకుండా వ్యవహరిస్తుందన్నారు. విమర్శించడం ఒక్కటే పనిగా జగన్‌ పెట్టుకున్నారని...

Monday, November 27, 2017 - 18:58

అనంతపురం : జిల్లాలో ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే హత్యకు ప్రత్యర్థి వర్గం హంతకుల ముఠాకు సుపారీ ఇచ్చింది. హంతక గ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Monday, November 27, 2017 - 18:57

అనంతపురం : మళ్లీ ఫ్యాక్షన్‌ భూతపు ఛాయలు..!సరికొత్త రూపులోకి ఫ్యాక్షనిజం పరకాయ ప్రవేశం..!సుపారీ సంస్కృతి వైపు మొగ్గుతోన్న ఫ్యాక్షనిజం..!ఉలికిపడుతోన్న అనంతపురం జిల్లా జనం..!!ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లా.. పదేళ్ల సుదీర్ఘ ప్రశాంతత తర్వాత.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజకీయ ప్రత్యర్థుల ఏరివేతకు.. కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జిల్లాలో తీవ్ర కలకలం...

Saturday, November 25, 2017 - 18:30

అనంతపురం : జిల్లా కదిరి మున్సిపాలిటీ అత్యవసర సమావేశం రసాభాసగా సాగింది. అజెండా అంతా చైర్‌ పర్సన్ సురియా బాను ఇష్టానుసారంగా ఉందంటూ టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాలులో గందరగోళం సృష్టించారు. సురియాబాను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అజెండా కాపీలను చించి వేశారు. గడువు ముగిసేవరకు తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదన్న చైర్ పర్సన్ సురియా బాను సమావేశాన్ని వాయిదా వేశారు. 

Pages

Don't Miss