అనంతపురం
Tuesday, October 24, 2017 - 13:41
Tuesday, October 24, 2017 - 09:42

అనంతపురం : జిల్లాలో నకిలీ నోట్ల బాగోతం వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి చెందిన పీవీకేకే ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 13:31

అనంతపురం : జిల్లా ముదిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేళాపురంలో వైసీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమీపంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు... నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే శివాలెత్తిపోయారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Monday, October 23, 2017 - 11:55

అనంతపురం : జిల్లా కరవుకు శాశ్వత చిరునామా. ఈ జిల్లాలో ఎప్పుడూ కరువు విలయతాండవం చేస్తూనే ఉంటుంది. వర్షాలు పడక, సాగునీరు అందక పంటలు పండవు. తాగడానికి నీరు దొరకక అనేక పల్లెలు అలమటిస్తుంటాయి. కానీ వీటన్నిటికి మొన్న కురిసిన కుండపోత వర్షం చెక్‌పెట్టింది. సాగు,తాగునీటి కష్టాలకు పరిష్కారం చూపింది. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. కొండలు, గుట్టలు,...

Monday, October 23, 2017 - 07:46

అనంతపురం : పెట్టుబడిదారులు దోపిడీని ఎలా చేస్తారో పెట్టుబడి గ్రంథం విశదీకరిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు అన్నారు. పెట్టుబడి గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. ముఖ్యంగా నిత్యం దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు వెంటనే క్యాపిటల్‌ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అనంతపురంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఏర్పాటు చేసిన కారల్‌మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం -...

Sunday, October 22, 2017 - 18:18

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమండలానికి వెళ్లినా ఎలాంటి పరిశ్రమలు రావని ఏపీసీసీ అధ్యక్షుడు రాఘువీరారెడ్డి విమర్శించారు. సిఎం, ప్రధాని చేసే విదేశీ పర్యటనలు వినోదయాత్రలే గాని వాటివల్ల ఎలాంటి లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు తోనే పరిశ్రమలు వస్తాయన్నారు. రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌లో ఉండే చేస్తానని ఇతర పార్టీలో చేరేదిలేదన్నారు రఘువీరా. మూడున్నర ఏండ్లలో ఒక్క...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 18:23

అనంతపురం : ఎన్ని సంఘటనలు జరుగుతున్నా పోలీసుల వైఖరి మాత్రం మారడం లేదు. నేరస్తులను గాలికొదిలేసి అమాయకులను చితకబాదుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో బయటపడింది. దీపావళి సందర్బంగా బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అయితే... పోలీసులను చూసి పేకాటరాయుళ్లు పరారయ్యారు. దీంతో పోలీసులు కేసుతో సంబంధం లేని ఇద్దరిని పీఎస్‌కు...

Pages

Don't Miss