అనంతపురం
Friday, January 19, 2018 - 18:08

అనంతపురం : మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి అని చెప్పడానికి ఇది మరో సంఘటన. తన పేరిట ఉన్న పొలాన్ని అనాథాశ్రమానికి ఇస్తాననడంతో తల్లిని చూడటం మానేశాడు కొడుకు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని ముద్దిరెడ్డి పల్లికి చెందిన గంగమ్మకి ముగ్గురు కుతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గంగమ్మ వృద్ధాప్యంలో ఉండటంతో ఆమె ఆలనా పాలన చూసేందుకు ముగ్గురు కుమారులు తల్లిని పంచుకున్నారు. చిన్న...

Monday, January 15, 2018 - 08:14

అనంతపురం : వృత్తి గొర్రెల కాపరి.. ప్రవృత్తి ప్రకృతిని చిత్రించడం.. పగలంతా పశువులు కాస్తూ.. రాత్రిపూట చిత్రాలు వేయడం నేర్చుకున్నాడు. పేదరికం వేధిస్తున్నా.. తనలోని కళాకారుడికి పదునుపెట్టాడు. నట్టడవిలో సంచరిస్తూ నలుగురూ మెచ్చే చిత్రాలు వేస్తున్నాడు..అనంతపురం జిల్లాకు చెందిన వెంకటరమణ. 
వృత్తిరీత్యా గొర్రెలకాపరి
ఇక్కడ పేపర్‌మీద చకచకా బొమ్మలేస్తున్న ఈ...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Friday, January 12, 2018 - 14:12

అనంతపురం : జిల్లాలోని కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిరంతరం ప్రజా సమస్యలను స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న 10టీవీకి చాంద్‌ బాషా అభినందనలు తెలిపారు. అందరికీ చాంద్‌ బాషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

Friday, January 12, 2018 - 14:10

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో కసాయి కొడుకుల నిర్వాకం వెలుగు చూసింది. మానవత్వం మర్చిపోయిన కసాయి కొడుకులు వృద్ధులైన  తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేశారు. ముద్దిరెడ్డిపల్లికి చెందిన వృద్ధ దంపతులు కిష్టప్ప, ఓబులమ్మలను లక్ష్మీనారాయణ, లోకేశ్ ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ స్ధానికంగా బట్టల దుకాణం నడుపుతున్నాడు. రెండో కొడుకు లోకేశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు....

Friday, January 12, 2018 - 11:40

అనంతపురం : తాడిపత్రిలోని పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలనాటి పండుగల ఆచారాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో ముగ్గులు వేసి.. రంగురంగుల బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మి దేవతల రూపంలో పిల్లలు అలరించారు. హరిదాసు వేషాలతో పిల్లలు.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

 

Thursday, January 11, 2018 - 18:08

అనంతపురం : ఏపీ రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మవరంలో 'జన్మభూమి - మన ఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మవరం చెరువుకు జలహారతి ఇచ్చిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

నదుల అనుసంధానంతో మహాసంగమం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి ఎకరానికి సాగునీరందిస్తామని, గతంలో...

Thursday, January 11, 2018 - 15:33

అనంతపురం : వివిధ సంఘాలు..పేద వారికి రూ. 4, 537 కోట్ల 47 లక్షలు ఇచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మవరంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కుమ్మరి, శాలివాహన 1595 మందికి 22 కోట్లు, కృష్ణ బలిజ, పూసల బలిజ ఫెడరేషన్ వారికి రూ. 3.54 లక్షలు ఇచ్చినట్లు..మేజర్ కార్పొరేషన్ లో 641 మందికి రూ. 7 కోట్లు, కల్లుగీత రంగానికి చెందిన 261 మందికి రూ....

Pages

Don't Miss