అనంతపురం
Thursday, August 3, 2017 - 09:13

అనంతపురం : జిల్లాలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ బాదన్న హత్య గురయ్యారు. కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వేటకొడవళ్లతో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. వాకింగ్ కు వెళుతుండగా దుండగులు దాడి చేయడంతో తీవ్ర గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ప్రస్తుతం బాదన్న ఏపీ రాష్ట్ర ఫెడరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. పోలీసులు నింధితులకోసం గాలిస్తున్నారు. 

Thursday, August 3, 2017 - 08:11

అనంతపురం : జిల్లా కేంద్రంలోని విజయనగరకాలనీ చెరువులో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తునట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Wednesday, August 2, 2017 - 14:51

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి చెందిన పీవీకేకే కాలేజీలో ర్యాగింగ్ భూతం జడలువిప్పింది. సీనియర్లు బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి నితీష్‌కుమార్‌ రెడ్డి గొంతు కోశారు. నితీష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నితీష్ కు 13 కుట్లు పడ్డాయి. అతని పరిస్థితి విషమంగా...

Wednesday, August 2, 2017 - 13:32

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. టీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకం రేగింది. సినియర్లు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి నితీష్ కుమార్ రెడ్డి గొంతుకోశారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

Sunday, July 30, 2017 - 19:12

అనంతపురం : వేరుశనగ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రెయిన్‌ గన్లను ఏర్పాటు చేసి రక్షక తడులందించే ప్రక్రియ చేపట్టింది. వర్షాభావ పరిస్ధితుల్లో రైతులు ఇరవై వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంటను సాగు చేశారు. ప్రస్తుతం నీరు లేక పంట ఎండిపోతున్న దశలో వుంది. ఈ క్రమంలో రక్షకతడుందించి పంటను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. హెచ్‌ఎల్సీ నుండి వచ్చే నీటిని వాడుకొని పంటకు నీరందించాలని...

Saturday, July 29, 2017 - 21:31

అనంతపురం : మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌ రెడ్డి వవ్యహారంపై పుట్టపర్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రిపదవిలో ఉన్నపుడు నియోజకవర్గవ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను పెంచిపోషించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిచోట తన సామాజిక వర్గ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ కాంట్రాక్టులు, ఇతర పనులు కట్టబెడుతూ తమకు అన్యాయం చేశారని కొందరు తెలుగు తమ్ముళ్లు అప్పట్లో చంద్రబాబుకు ఫిర్యాదు...

Saturday, July 29, 2017 - 11:43

అనంతపురం : వేరుశనగ పంటకు రక్షక తడులందించి పంటను కాపాడే ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. వర్షాలు లేక, బోరుబావులు ఎండిపోతున్న పరిస్థితుల్లో....ప్రభుత్వం, రక్షక తడులకు ఏ విధంగా నీరు అందిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి.

పంటలను కాపాడేందుకు ప్రభుత్వం...

Saturday, July 29, 2017 - 07:35

అనంతపురం : జిల్లాలో అధికాపార్టీ రాజకీయం రంజుగా సాగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆదిపత్య రాజకీయాలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య అంతర్గతంగా పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు  ఇరువర్గాలు పొలిటికల్‌ గేమ్‌ను రక్తికట్టిస్తున్నాయి. 
పల్లె రఘునాధ్‌రెడ్డి వర్సెస్ నిమ్మల కిష్టప్ప 
...

Thursday, July 27, 2017 - 16:57

అనంతపురం : హీరోయిన్‌ తమన్నా సందడి చేసింది. నగరంలో ఏర్పాటు చేసిన మలబార్‌ గోల్డ్‌ 170వ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతపురం రావడం ఎంతో సంతోషంగా ఉందని తమన్న ఈ సందర్భంగా అన్నారు. తన కెరీర్‌లో బాహుబలి గుర్తుండిపోయే సినిమా అని అభిమానులు నిరాశపడకుండా మంచి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కాగా తమన్నాను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. 

Thursday, July 27, 2017 - 15:29

అనంతపురం : ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్లాస్టిక్ బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల... అనారోగ్యానికి గురవుతున్నామని... ఇందుకు కారణమైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.
వేలకు వేలు ఫీజులు కడుతున్నా భోజనం సరిగ్గా పెట్టడం లేదని పేర్కొన్నారు...

Pages

Don't Miss