అనంతపురం
Monday, January 1, 2018 - 18:02

అనంతపురం : పద్య నాటకాన్ని విశ్వవాప్తం చేసి పౌరాణిక నాటక రంగానికి ఘన కీర్తి తెచ్చిన వ్యక్తి బళ్లారి రాఘవ. స్వాతంత్ర్య ఉద్యమంలో సామాజిక మార్పు కోసం ప్రదర్శనలిచ్చి ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధులుగా, న్యాయవాదిగా, నటుడిగా పేరొందిన బళ్లారి రాఘవను స్మరించుకునేందుకు..ఆయన పేరిట సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రజానాట్యమండలి. మరుగునపడిన సాంస్కృతిక సౌరభాలను...

Saturday, December 30, 2017 - 14:29

అనంతపురం : నేటి విద్యార్థులు ఒత్తిడినుంచి బయటపడేందుకు క్రీడలు చాలా అవసరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంజిఎం క్రీడా మైదానంలో బసవతారకరామ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ టాస్‌ వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాట్‌ పట్టుకుని ఆడారు.

Friday, December 29, 2017 - 21:15

అనంతపురం : స్వర్గీయ ఎన్టీఆర్‌ కలను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నందమూరి బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గంలో 2వ రోజు పర్యటన సందర్భంగా బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 194 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న పైప్‌ లైన్‌ బృహత్తర నీటి పథకం పనులను ఆయన ప్రారంభించారు. 66 కోట్లతో డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు...

Friday, December 29, 2017 - 11:39

అనంతపురం : జిల్లాలోని వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాల దగ్గర బారులు తీరారు. అనంతపురం నగరంలోని పురాతన ఆలయం చెన్నకేశవ ఆలయంతో పాటు పలు వేంకటేశ్వర  ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

 

Wednesday, December 27, 2017 - 12:13

అనంతపురం : రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రధాన్యత ఇవ్వాలని  జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని  నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.  అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, 2018 డిసెంబర్‌ చివరినాటికి పూర్తి...

Tuesday, December 26, 2017 - 21:54

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైసీపీ పోరాడుతుందని.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన హోదా వస్తే ఇన్‌కం టాక్స్‌తో పాటు జీఎస్టీ లాంటి పన్ను మినహాయింపులు ఉంటాయని అన్నారు. రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయని.. యువతకు ఉద్యోగం, ఉపాధి లభిస్తుందని చెప్పారు. సభలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ...

Tuesday, December 26, 2017 - 20:30

అనంతపురం : ప్రజలకు ఆల్‌లైన్‌ విధానం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని అనంతపురం జిల్లా రవాణా ఉప కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ సుందర్‌ వడ్డి తెలిపారు. అనంతపురం రవాణా కార్యాలయంలో ఇప్పుడు క్యాష్‌లెస్‌ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామన్నారు. క్యాష్‌లెస్‌ విధానం అమలు చేస్తోన్న ఆర్టీవోల్లో తాము మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ...

Tuesday, December 26, 2017 - 20:28

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో టమోటా రైతులు రోడ్డెక్కారు. కేజీ టమోటా ధర 50 పైసలు మాత్రమే పలుకుతుండటంతో.. రోడ్డుపైన పారబోయి నిరసన తెలిపారు. టమోటా పండిస్తే లాభం మాటామోగానీ కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరం టమోటా సాగు చేస్తే దాదాపు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని.. టమోటా పంటకు 5 వేల రూపాయలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం టమోటా రైతులను ఆదుకోవాలని...

Tuesday, December 26, 2017 - 13:26

అనంతపురం : జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. మార్కెట్ విస్తరణలో భాగంగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ కేఆర్ రామన్న అనే వ్యక్తి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులతో మాట్లాడుతూనే రామన్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అధికారుల తీరు వల్లే రామన్నకు గుండె పోటు విచ్చిందని ఆయన మృతదేహంతో టీ సర్కిల్ వద్ద వ్యాపారులు ఆందోళనకు దిగారు. మరింత...

Pages

Don't Miss