అనంతపురం
Monday, May 9, 2016 - 15:47

విజయవాడ: రాష్ట్ర విభజన పూర్తయి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ విభజన చట్టంలోని ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కనీసం ఈ మిగిలిన మూడేళ్లలో అయినా హామీలు పూర్తిచేయాలంటూ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం అయ్యిందని రామకృష్ణ పేర్కొన్నారు. 

Monday, May 9, 2016 - 12:17

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇటీవల 'హోదా' రాదనే విషయాన్ని కేంద్ర మంత్రి సాక్షాత్తూ పార్లమెంట్ లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీలోని విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. అందులో భాగంగా మేధావుల ఫోరం నేత చలసాని ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. రెండో రోజైన సోమవారం దీక్షా శిబిరానికి సినీ నటుడు శివాజీ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. వైద్యులు...

Sunday, May 8, 2016 - 19:26

అనంతపురం : జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. 3వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే బాలుడు చీరతో కట్టిన ఉయ్యాలలో ఊగుతుండగా ప్రమాదవశాత్తు చీర గొంతుకకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ హఠాత్ పరిణామానికి మహేంద్ర తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించుకోలేదని బంధువులు విలపించారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయారు.

Sunday, May 8, 2016 - 19:14

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ, అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు మద్దతు పలికారు. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రప్రజలను బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని మధు అన్నారు. బిజెపితో స్నేహం వలన రాష్ట్రానికి ఒరిగేదేం లేదంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పేర్కొన్నారు.

Sunday, May 8, 2016 - 14:50

అనంతపురం:  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏపీఎస్ ఎస్ పీసీ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 4,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదిహేను ఐటీ కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ అధికారులు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 352 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. పరిటాల రవీంద్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తమకు శిక్షణ ఇచ్చినందునే ఉద్యోగాలు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. 

Friday, May 6, 2016 - 06:48

విజయవాడ : రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు చంద్రబాబు. అవసరమైతే మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధానికి సమస్యలు వివరిస్తానన్నారు. మరోవైపు ఆర్ధికంగా ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని బాబు స్పష్టం చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన...

Wednesday, May 4, 2016 - 15:51

అనంతపురం : తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనంతపురంలోని మున్సిపల్‌ గెస్ట్ హౌస్‌లో శాంతి భద్రతలు, కరవు వంటి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. కరవు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. వివిధ శాఖల్లో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. పోలీస్‌...

Tuesday, May 3, 2016 - 11:35

విజయవాడ : సోమవారం కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వర్షం రైతులకు నష్టాన్ని తీసుకొచ్చింది. ఇలా అకాల వర్షాలు రైతుల కంట కన్నీరు తీసుకొచ్చాయి.

అనంతపురంలో వడగళ్ల వర్షం...

సోమవారం కురిసిన అకాల వర్షం అనంతపురం...

Saturday, April 30, 2016 - 16:04

అనంతపురం: పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ ఛైర్మన్‌ రామాంజనేయులు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బినామీ ఇళ్లలో ఐదుమంది సీ.ఐ లు ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు కీలక విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. అతని వద్ద నుంచి 8లక్షల 30వేలు నగదు, 30తులాల బంగారం,16 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 

Saturday, April 30, 2016 - 10:39

అనంతపురం : పుట్టపర్తి ఉడా వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై ఎసిబి దాడులకు పాల్పడింది. రూ.1.30 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. రెండు కార్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్, బెంగుళూరు, 
అనంతపురం, హిందూపురంలలో రామాంజనేయులపై అక్రమాస్తులు కలగివున్నట్లు సమాచారం..

Friday, April 29, 2016 - 11:33

అనంతపురం : ఏపీలో నియంతృత్వ రాజ్యం నడుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. పరిగిలోని రావతార్ మసాలా ఫ్యాక్టరీలో 182 మంది కార్మికులను విధుల నుండి తొలగించిన నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. 10 టీవీతో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వం కంటే హీన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 144...

Pages

Don't Miss