అనంతపురం
Monday, July 24, 2017 - 12:26

అనంతపురం : జిల్లాలోఎస్ఎఫ్పై కదం తొక్కింది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై ఎస్ఎఫ్ఐ కలక్టరేట్ ముట్టడించింది. పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Saturday, July 22, 2017 - 15:46

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో నీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. నెల రోజుల నుండి నీళ్లు రావడం లేదంటూ..  హిందూపురం చిన్న మార్కెట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పి పంపించారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా తమకు నీటి కష్టాలు తీర్చడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను తీర్చకపోతే మున్సిపల్‌ ఆఫీసును ముట్టడిస్తామని మహిళలు...

Friday, July 21, 2017 - 18:46

అనంతపురం : జిల్లాలోని పెనుకొండలో రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై భైటాయించి ఆందోళన చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సురెన్స్ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. 

Thursday, July 20, 2017 - 17:09

అనంతపురం : వరుస కరువులతో అనంత రైతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో ఒకేసారి వర్షం కురిపించి వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో రైతులు పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయారు. రోజురోజుకీ దీనావస్థలో కూరుకుపోతున్న అనంత రైతన్నపై 10టీవీ ప్రత్యేక కథనం. 
అతి తక్కువ వర్షాపాతం 
అనంతపురం జిల్లాలో ఎప్పుడూ అతి తక్కువ వర్షాపాతం నమోదవుతుంది. దీంతో జిల్లాలో...

Wednesday, July 19, 2017 - 19:55

అనంతపురం : ఏపీలో టీచర్ల బదిలీ విషయం ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. రోజుకొక నిర్ణయంతో టీచర్లు సతమతమవుతున్నారు. పాయింట్ల విధానంతో  ప్రతీ రోజూ ఉపాధ్యాయులు టెన్షన్‌ పడుతున్నారు. ఒక్క అనంతపురంలోనే పది వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ల కోసం అప్లై చేసుకొన్నారంటే.. టీచర్లలో ఎంత టెన్షన్‌ ఉందో అర్థమవుతుంది. 
10 వేల మంది దరఖాస్తు 
అనంతపురం జిల్లాలో...

Wednesday, July 19, 2017 - 14:39

అనంతపురం : సీజనల్‌ వ్యాధులు వస్తాయని తెలిసినా అధికారులు స్పందించలేదు. అనంతపురంలో ఇప్పడివరకూ వందకు పైగా బాధితులు విషజ్వరాల భారిన పడ్డారు. ఇంత జరుగుతున్నా వైద్యశాఖాధికారులు మాత్రం అక్కడక్కడ తప్పితే ఎక్కడా విషజ్వరాలు లేవంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విష జ్వరాలు వస్తాయని తెలిసినా, ఏ ఒక్క శాఖాధికారుల్లో చలనం లేదు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు...

Tuesday, July 18, 2017 - 21:39

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదభయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని విశాఖ వాతారణ కేంద్రం తెలిపింది.
48 గంటల్లో..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ...

Tuesday, July 18, 2017 - 15:08

అనంతపురం : జిల్లాలో ఓ కీచక టీచర్‌ భాగోతం వెలుగులోకి వచ్చింది. హిందూపురం నగరం మోడల్‌ కాలనీలోని.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మల్లికార్జున అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. విద్యార్థినిల పట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Friday, July 14, 2017 - 15:11

అనంతపురం : జిల్లాలోని గుంలకల్లులో రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో విషాదం నెలకొంది. స్కూల్ గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి రవికుమార్(4)మృతి చెందాడు. ఈ సంఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీంతె ఆమెను గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందినట్ట విద్యార్థిసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss