అనంతపురం
Sunday, December 17, 2017 - 14:22

ఢిల్లీ : తమకు ప్రత్యేక బిల్లు తీసుకరావాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ జెండర్లు కదం తొక్కారు. దేశ రాజధాని ఢిల్లీలో వారు భారీ ఎత్తున ఆందోళన చేశారు. పార్లమెంట్ లో కేంద్రం ట్రాన్స్ జెండర్ 2016 బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ట్రాన్స్ జెండర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అయితే తమ ఉనికి కనమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు...

Sunday, December 17, 2017 - 12:43

అనంతపురం : జిల్లాలో ఇసుక మాఫియా అడ్డూ అదుపూ లేకుండా బరితెగిస్తోంది... ఇసుక అక్రమ తరలింపు ద్వారా.. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు గండి కొడుతోంది. అధికారులు ఎవరిని ప్రశ్నించినా.. తమకేమీ తెలియదనో.. నిందితులపై చర్యలు తీసుకుంటామనో దాటవేస్తున్నారు. కరవు జిల్లాలో ఇష్టారాజ్యంగా సాగుతోన్న ఇసుక మాఫియా దందాపై టెన్‌టీవీ  స్పెషల్‌ ఫోకస్‌
యధేచ్చగా ఇసుక  అక్రమ రవాణా...

Saturday, December 16, 2017 - 19:48

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక మాఫియాపై 10టీవీలో ప్రసారమైన కథనాలపై అధికారులు స్పందించారు. ఇంచార్జ్ కలెక్టర్‌ రమామణి ఆర్డీవోతో విచారణకు ఆదేశించారు. రూ.4 కోట్లు విలువ చేసే ఇసుకను రికవరి చేస్తామని రమామణి చెప్పారు. 

 

Friday, December 15, 2017 - 06:39

అనంతపురం : లంచాలకు కక్కుర్తిపడి వందలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే ఎఫ్‌సిఐ గోదాములను మూసివేశారని వైసిపి అధినేత వైఎస్ జగన్‌ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్ర 35వ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. రాప్తాడు నియోజక వర్గం గంగులకుంట నుంచి కందుకూరు, హంపాపురం, చిగిచెర్ల వరకు కొనసాగింది. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేటితో రాప్తాడు నియోజక వర్గంలో...

Thursday, December 14, 2017 - 21:55

అనంతపురం : లంచల కోసమే ఎఫ్ సీఐ గోదాములు మూశారని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఆయన ప్రజాసంకల్ప యాత్రకు స్వల్ప విరామన్ని ఇచ్చారు. రేపు కోర్టుకు హాజరుకవాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Thursday, December 14, 2017 - 10:50
Sunday, December 10, 2017 - 15:19

అనంతపురం : ఏపీలో అధికారపార్టీ నేతలు దోపిడి దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరికి ఉపాధి హామీ పథకాన్నీ వదల్లేదన్నారు. పేదలు చేసిన కూలీకి డబ్బులు చెల్లించని సర్కార్‌... టీడీపీ నేతలు జేసీబీలతో చేసే పనులకు మాత్రం చెల్లింపులు చేస్తోందని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో ఇందిరమ్మ రాజ్యం -...

Thursday, December 7, 2017 - 21:55

అనంతపురం : పాదయాత్ర పేరుతో జగన్‌ సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపారన్నారు మంత్రి కాల్వ శ్రీనివాసులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన విపక్షనేత చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదన్నారు. సైన్స్‌ సిటీ, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ లాంటి పేర్లతో జగన్‌ దోపిడీ చేస్తే...  కియా లాంటి ప్రాజెక్టులు తెచ్చి తాము రాయలసీమ అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు. 

 

Thursday, December 7, 2017 - 19:36

అనంతపురం : వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. గణేష్ సర్కిల్‌ నుండి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని  గిరిజన నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి...

Pages

Don't Miss