అనంతపురం
Sunday, January 24, 2016 - 06:44

విజయవాడ : సీమ జిల్లాలను రాజధానితో అనుసంధానిస్తూ 965 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. విశాలమైన ఈ రోడ్లకు 14వేల 400 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసింది. రాయలసీమ ప్రధాన నగరాలనుంచి ప్రకాశం జిల్లా మర్కాపురం వరకూ నాలుగు వరుసల రోడ్డు. అక్కడినుంచి అమరావతి వరకూ ఆరు వరసల రహదారినీ నిర్మించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనంతపురం నుంచి అమరావతి...

Thursday, January 21, 2016 - 18:19

అనంతపురం : అకాల వర్షం కరవు ప్రాంత రైతులను నిండా ముంచింది. తాడిపత్రి డివిజన్ పరిధిలో కురిసిన వర్షానికి చేతికందొచ్చిన పంట నేలపాలైంది. పెద్దపప్పూరు, యాడికి, ఎల్లనూరు, పుట్లూరు, పెద్దవడుగూరు మండలాల్లో  పప్పుశనగ, జొన్న, దనియాలు, పత్తి, కంది పంటలు నేల పాలయ్యాయి. ఒక్క తాడిపత్రి డివిజన్‌ పరిధిలోనే అకాల వర్షానికి సుమారు 8.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు....

Thursday, January 21, 2016 - 17:52

అనంతపురం : ప్రఖ్యాత పుణ్య క్షేత్రం తిరుపతికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని డీఐజీ సత్యనారాయణ అన్నారు. అనంతపురంలోని ఎస్ ఎస్ బిఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన 'చట్టం, న్యాయవ్యవస్థ'పై అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులకు చట్టం పట్ల అవగాహన కల్పిస్తే నేరాలను అదుపుచేయవచ్చని తెలిపారు. హర్యానా, పంజాబ్, బీహార్ నుండి వేలాది మంది తిరుపతిలో నివసిస్తున్నారని వారిపై ఎప్పుడూ నిఘావేసి...

Thursday, January 21, 2016 - 06:28

విజయవాడ : రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ఏపీలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ చేపట్టారు. కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే...

Tuesday, January 19, 2016 - 20:15

అనంతపురం : క్రికెటర్ ధోనికి ఊరట లభించింది. ధోనిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను అనంతపురం కోర్టు రద్దు చేసింది. ధోనీ, దేవతా స్వరూపంలో ఉన్నట్లుగా బిజినెస్‌ టుడే పత్రిక ముఖచిత్రం ప్రచురించింది. దీనిపై ఆగ్రహించిన విశ్వ హిందూ పరిషత్.. ధోనీపై కోర్టులో కేసు వేసింది. ఆస్ట్రేలియాతో సిరీస్ జరుగుతున్నందున ధోనీ హాజరు కాలేడని , వారెంట్ ను రద్దు చేయాలని ధోనీ తరపు న్యాయవాది కోర్టుకు...

Tuesday, January 19, 2016 - 19:44

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. సమృద్ధి జీవన్ చిట్స్‌ ఏజెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని అమడుగూరు మండలం సినిగానిపల్లె నివాసి శ్రీనివాసరెడ్డి కర్ణాటకకు చెందిన సమృద్ధి జీవన్ చిట్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో తన పొలంలో పురుగులమందు తాగి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ వ్యవహారాలే అతని ఆత్మహత్యకు కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి...

Tuesday, January 19, 2016 - 19:37

అనంతపురం : ఎయిరిండియా మేనేజర్ పై దాడి కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని 2 రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని శ్రీకాళహస్తి కోర్టులో పోలీసుల పిటీషన్ వేశారు. మరోవైపు  బెయిల్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తిరుపతి సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

 

Monday, January 18, 2016 - 18:20

అనంతపురం : ఏపీ రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ లు పెంచిన ఘనత తమదే..వారికి ఎలాంటి సమస్యలు రాకుండా పెన్షన్ లు ఇస్తున్నామంటూ బాబు సర్కార్ గొప్పలు చెప్పుకొంటుంటుంది. కానీ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇది అంతా శుద్ధ అబద్ధమని నిరూపిస్తోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం భారీ సంఖ్యలో వృద్ధులు చేరుకున్నారు. తమకు పెన్షన్ రావడం లేదని, నెలల పాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు కనికరించడం...

Thursday, January 14, 2016 - 16:35

అనంతపురం : పాపంపేటలో ఇంటి నిర్మాణం విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తున్నారని రాజేశ్వరి, చంద్రన్న దంపతులు ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కింటివాళ్లు తనపై దాడి చేసి, వివస్త్రను చేశారని చంద్రన్న కుమార్తె సుష్మా...

Wednesday, January 13, 2016 - 17:31

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల కోసం ప్రభుత్వం కోటి రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు మంతి పల్లె ప్రకటించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గౌండ్స్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో మంత్రులు పల్లె, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు..అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పంచెకట్టుతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు...

Tuesday, January 12, 2016 - 12:50

అనంతపురం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీనివాస్, మీనాక్షిలు మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఈనేపథ్యంలో మీనాక్షి అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న విభేదాల వల్లే తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త శ్రీనివాస్ తెలిపాడు. అయితే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు...

Pages

Don't Miss