అనంతపురం
Saturday, July 11, 2015 - 20:41

అనంతపురం: జిల్లా కేంద్రంలో నకిలీ పాసు పుస్తకాల పరంపర కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం భారీ స్థాయిలో నకిలీ పాసు పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకోగా.. నేడు మరికొన్ని పాస్‌పుస్తకాలను పోలీసులు, విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కె.ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తికి శివకాశి నుంచి ఈ నకిలీ పాసు పుస్తకాలు వచ్చాయి. వీటిని అధికారులు ఓ ప్రైవేట్‌ ట్రాన్స్ పోర్ట్ లో స్వాధీనం చేసుకున్నారు...

Tuesday, July 7, 2015 - 16:17

అనంతపురం : జిల్లాలో మళ్లీ నకిలీ రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు కలకలం సృష్టించాయి. అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఓ బ్యాంకులో సుమారు 500 పాస్ పుస్తకాలు బయటపడ్డాయి. ఇటీవలే నకిలీ పుస్తకాలను తయారు చేస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 20 బృందాలు జిల్లాల్లోని తహశీల్దార్ కార్యాలయాలు..పలు...

Monday, July 6, 2015 - 20:54

అనంతపురం : చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో సీపీఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల హామీలను సర్కార్‌ విస్మరిస్తోందని ఆరోపించారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పవర్‌ లూమ్స్‌ మగ్గాలను నియంత్రించకపోవడం వల్లే చేనేత మగ్గాలు...

Monday, July 6, 2015 - 20:52

అనంతపురం : పోలీసులను దూషించిన కేసులో అరెస్టు అయిన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్‌ కోసం కోర్టు పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ రేపు విచారణకు వస్తుందని ఎమ్మెల్యే అఖిల ప్రియ తెలిపారు. భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా భూమాను హైదరాబాద్‌ తరలించాలని అఖిలప్రియ కోరారు.

Monday, July 6, 2015 - 06:18

అనంతపురం: జిల్లా కేంద్రంగా నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా చలామణి చేసే ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 1.13కోట్లరూపాయలు విలువ చేసే 17వేల నకిలీ పాసుపుస్తకాలతో పాటు మహేంద్ర కారు, లక్ష రూపాయల నగదు, కంప్యూటర్లు,ప్రింటర్లు, స్టాంపులు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాసుపుస్తకాలతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వివిధ మార్గాల్లో కాజేయడంతో...

Sunday, July 5, 2015 - 15:21

అనంతపురం: జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది ముఠా సభ్యుల నుంచి కోటి 13 లక్షల విలువైన 17 వేల పాసు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠా నుంచి లక్ష రూపాయల నగదు, తయారీ సామాగ్రి, ఇన్నోవా వాహనం, వేటకొడవలి లభించింది. ధర్మవరం కేంద్రంలో 15 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ...

Pages

Don't Miss