చిత్తూరు
Tuesday, May 22, 2018 - 21:52

తిరుమల : ధార్మిక క్షేత్రం టీటీడీ వివాదాల పుట్టగా మారింది. టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి ఉద్యాసనకు గురైన రమణదీక్షితులు, అధికారుల పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఈ అంశం.. రాజకీయ రంగు పులుముకుంది. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని, కైంకర్యాలు ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నాయంటూ దీక్షితులు చేసిన ఆరోపణల తర్వాత వివాదం తారా స్థాయికి చేరింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న...

Tuesday, May 22, 2018 - 20:38

టీటీడీ మాజీ అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. సీఎం చంద్రబాబు టీటీడీ పాలకమండలితో సమావేశమయ్యారు. శ్రీవారి ఆభరణలు,అవినీతి, ఆ ప్రాంతంలోజరుగుతున్న అవకతవకలపై చర్చ జరగాల్సిన అవసరముందని రమణదీక్షితుల వాదన..మరోపక్క ఆభరణాలు సురక్షితంగా వున్నాయనీ..అవినీతి ఏమీ జరగటంలేదని పాలకమండలి స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ కుమారస్వామి రమణదీక్షితులుకి...

Tuesday, May 22, 2018 - 20:27

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన.. సీబీఐకి లేఖ రాశారు. స్వామివారి బంగారు ఆభరణాలు, ఆస్తుల లెక్కతేల్చాలంటున్న హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ డిమాండ్ చేశారు.

Tuesday, May 22, 2018 - 19:17

తిరుమల కొండపై ఏం జరుగుతోంది? శ్రీవారి ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్న రమణదీక్షితులకు ఎందుకు బలంతంగా పదవీ విరమణ చేయించారు? టీటీడీ అంశంలో సీబీఐ విచారణ చేయించాలనే డిమాండ్ ఎందుకొస్తోంది? ఈనేపథ్యంలో టీటీడీ అర్చకుల భవిష్యత్తు ఏమిటి? ఈ అంశంపై 10టీవీ చర్చ..ఈ చర్చలో బీజేపీ నేత బాబ్జీ, టీటీడీ ఉద్యోక కార్మిక సంఘాల నాయకులు కందారపు మురళి పాల్గొన్నారు. 

Tuesday, May 22, 2018 - 17:34

అమరావతి : 2011లో ఆభరణాలు లెక్కించనప్పుడే చాలా ఆభరణాలు మిస్‌ అయ్యాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ చెన్నారెడ్డి అన్నారు. ఆభరణాల విషయంలో ఇప్పటి ప్రభుత్వాలకు కానీ, గత ప్రభుత్వాలకు కానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రమణ దీక్షితులకు సమస్య వచ్చింది కాబట్టే ఆభరణాలపై ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచాలని..భారతదేశంలోని పలు విలువైన...

Tuesday, May 22, 2018 - 14:34

అమరావతి : ఇటీవల కాలంలో టీటీడీ వేదికగా అనేక వివాదాలకు నెలవుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టీటీడీని కుదిపేస్తోన్న వివాదాలపై పాలక మండలి అధికారులతో రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పలు విషయాలపై సీఎంకు వివరించామని టీటీడీ ఈవో అనిల్...

Tuesday, May 22, 2018 - 13:06

చిత్తూరు : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ గ్రామస్తులు మళ్లీ ఆందోళనలకు దిగారు. గడిచిన నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు..కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. వెంటనే కంపెనీని మూసివేయాలని, కాపర్ ప్లాంట్ కారణంగా తాము శ్వాససంబంధిత ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలు...

Tuesday, May 22, 2018 - 12:25

చిత్తూరు : టిటిడిలో ఏం జరుగుతోంది ? రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు జాతీయస్థాయిలో చర్చకు దారి తీస్తుండడం..భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిటిడి ఈవో, టిటిడి ఛైర్మన్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

గత కొన్ని...

Tuesday, May 22, 2018 - 09:37

విజయవాడ : టిటిడి...తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మధ్య వివాదం సద్దుమణగడం లేదు. వీరిద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టిటిడిని టార్గెట్ చేస్తూ రమణ దీక్షితులు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టిటిడి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. వివాదం మరింత ముదరకముందే..టిటిడి పరువు..ప్రతిష్టను మరింత దిగజారకముందే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం...

Monday, May 21, 2018 - 14:49

చిత్తూరు : వీడు ఒక తండ్రేనా ? అంటారు మీరు ఈ వార్త చదవి...వావివరసలు మరిచిపోయాడు..కన్నకూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు..ఇందుకు భార్య కూడా సహకరించడం పాశవికం. గత మూడేండ్లుగా అనాగరికం కొనసాగుతోంది. ఎట్టకేలకే ఆ కామాంధుడి తండ్రికి చెక్ పెట్టిందో ఓ కూతురు. మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చంద్రగిరి సమీపంలో ఓ తండ్రి కన్నకూతురిపై దారుణంగా...

Monday, May 21, 2018 - 11:00

తిరుమల : తిరుమలలో విధుల నుంచి తొలగించబడిన రమణ దీక్షితులు - టీటీడీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. శ్రీవారి కైంకర్యాలు, నిత్య నివేదనల్లో అధికారులు, పాలక మండలి జోక్యం పెరిగిపోయిందని రమణదీక్షితులు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి.. రమణదీక్షితులకు 65 ఏళ్ల వయోపరిమితితో రిటైర్‌మెంట్‌ ఇచ్చింది. దీంతో రమణదీక్షితులు శ్రీనివాసుని ఆభరణాలు, సంపద...

Pages

Don't Miss