చిత్తూరు
Sunday, January 15, 2017 - 13:31

చిత్తూరు : రంగం పేటలో జల్లికట్టు క్రీడ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు మాట్లాడుతూ... తమిళనాడు జల్లికట్టుకు, రంగంపేట జల్లికట్టుకు సంబంధం లేదని తెలిపారు. మేం జంతువులను హింసించం అని తెలిపారు. ఈ ఆటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి జనాలు తరలి వచ్చారు. ఈ ఆటలో పశువుల కొమ్ములకు పలకలు, కొన్ని బంగారు ఆభరణాలు తగిలిస్తారు. దాన్ని పట్టుకునేందుకు యువకులు ఉరుకులు తీస్తున్నారు.

Sunday, January 15, 2017 - 09:54

చిత్తూరు : రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. రైతులు ఆవులను ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టు పేరిట పశువులను హింసించడం తగదంటూ గ్రామంలో పోలీసులు పోస్టర్లు అంటించారు. పశువులను గ్రామంలోకి వదలొద్దని ఆవుల యజమానులకు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఎవరికైనా హానీ జరిగితే కేసులు పెడతామని హెచ్చరించారు.

Saturday, January 14, 2017 - 07:09

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరుకు వెళ్లారు. బంధువులు, కుటుంబసభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా నారావారిపల్లెకు చేరుకోవడంతో.. చంద్రబాబు ఇంట్లో పండగ ఉత్సాహం మరింత పెరిగింది. చంద్రబాబు రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది.
బాబు రాకతో నారావారిపల్లెలో సందడి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

Friday, January 13, 2017 - 16:16

చిత్తూరు : తన బైక్ కు అడ్డురావడమే కాకుండా..కొద్దిగా తాకినందుకు ఓ యువకుడు..అతని స్నేహితులు మరో యువకుడిని చితకబాదారు. ఈ ఘటన అతని కండకావురానికి నిలువెత్తు నిదర్శనం. అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద బైక్ పై బాలకృష్ణమ్మ నాయుడు ఆగి ఉన్నాడు. వెనుక నుండి సైకిల్ పై వచ్చిన విజయ్ బాబు బైక్ మిర్రల్ ను కొద్దిగా తాకాడు. వెంటనే తీవ్ర...

Thursday, January 12, 2017 - 11:55

తిరుపతి : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి  ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య కెరీర్‌లో ఇది వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. మరో వైపు బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి...

Thursday, January 12, 2017 - 09:56

తిరుపతి : నేడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శాతకర్ణి మూవీ బెనిఫిట్‌ షో చూసిన బాలకృష్ణ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సినిమా బాగుందంటున్నారు. సినిమా...

Wednesday, January 11, 2017 - 10:58

తిరుపతి : ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది. థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తిరుపతిలోని అన్ని థియేటర్లలో తెల్లవారుజామున షో వేశారు. సినిమా చూసిన ఫ్యాన్స్ మూవీ బ్లాక్ బ్లస్టర్ అంటున్నారు. డ్యాన్సులు, ఫైటింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయో.. ఇప్పుడ ఇలాగే ఉన్నాయని అంటున్నారు. డ్యాన్సులు ఇరగదీశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. మెగాస్టార్ అని మరోసారి...

Wednesday, January 11, 2017 - 09:09

చిత్తూరు : 'మెగాస్టార్ 'చిరంజీవి' ఎవర్ గ్రేట్..ఆయన డ్యాన్సులు..ఫైట్లు సూపర్బ్..ఖైదీ నెంబర్ 150లో ఇరగదీశాడు. కొడుకుతో కలిసి పోటాపోటీగా నటించాడు..సినిమా చాలా బాగుంది' అంటూ అభిమానులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ప్రపంచ వ్యాప్తంగా 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలైంది. అభిమానుల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులోల భాగంగా జిల్లాలోని ఓ థియేటర్ లో సినిమా చూసిన...

Tuesday, January 10, 2017 - 11:57

చిత్తూరు : టిటిడి కాంట్రాక్ట్‌ కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయడంతో పాటు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. టిటిడి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని ముట్టడించారు. చైర్మన్‌ చదలవాడ ఇంటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Pages

Don't Miss