చిత్తూరు
Sunday, March 13, 2016 - 18:29

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. కోటి రూపాయల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు గొల్లపల్లి చెక్‌పోస్ట్‌ దగ్గర అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరిని చూసిన టాటా సుమో డ్రైవర్‌ వాహనాన్ని వెంటనే వెనక్కితిప్పారు. వెంటనే అధికారులు సుమోను వెంబడించారు. వేగంగా ప్రయాణీస్తున్న సుమో అదుపుతప్పి పంట పొలాల్లోకి...

Saturday, March 12, 2016 - 11:35

చిత్తూరు : నిర్బయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కడపలో చిన్నారిపై అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన మరువకముందే తాజాగా చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. దుండగులు బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత మార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని కుప్పం రైల్వే క్వార్టర్స్ లో పదేళ్ల...

Saturday, March 12, 2016 - 07:36

చిత్తూరు : తిరుమలలో వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదలైంది. శ్రీవారి ఆలయం ఎదుటే వేయికాళ్ల మండపం నిర్మించాలంటూ గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే  నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపం నిర్మాణానికి టీటీడీ సిద్ధమైంది. దీంతో ఈ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. 
వేయికాళ్ల మండపం నిర్మాణంపై హైకోర్టు స్టే
తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో 18...

Friday, March 11, 2016 - 15:42

చిత్తూరు : నిత్యానంద..వివాదాల స్వామి..ఈ స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో శిష్యురాలు రంజితతో ప్రత్యక్షమైన నిత్యానంద నేడు తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ లో ఆయన నిత్యానందకు దర్శన ఏర్పాట్లను టిటిడి అధికారులు కల్పించారు. వైకుఠం క్యూ కాంప్లెక్సు ద్వారా సామాన్యు భక్తులతో కలిసి...

Friday, March 11, 2016 - 12:05

చిత్తూరు : తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపం పునర్‌ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీవారి ఆలయం ఎదుట కాకుండా నారాయణగిరి ఉద్యానవనంలో మండపం ఎందుకు నిర్మిస్తున్నారని పిటిషన్‌ దాఖలు అయ్యింది. కిషోర్‌ స్వామి, ఓలేటి లక్ష్మీనాథాచార్య హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు సమాచారం. కోర్టు స్టే విధించడంతో టీటీడీ టెండర్లను నిలిపివేసింది.  

 

Wednesday, March 9, 2016 - 11:39

తిరుపతి : సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన నారావారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టనీయమని టిడిపి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. జాతీయ రహదారిపై బైఠాయించడంతో తిరుపతి - బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ మందకృష్ణ మాదిగ విశ్వరూప చైతన్యయాత్రను చంద్రగిరి నుండి...

Tuesday, March 8, 2016 - 17:47

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా పేర్కొన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకే కృష్ణను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2003, అక్టోబర్ 1వ తేదీన బాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి నుండి ఈ కేసు కొనసాగుతోంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధాలు చూపించకపోవడంతో సాకే కృష్ణను నిర్ధోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సివిల్...

Monday, March 7, 2016 - 07:01

చిత్తూరు : జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటీశ్వరాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున అటవీశాఖ  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి....శ్రీకాళహస్తీశ్వరుడికి  ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. 
వైభవంగా మహా శివరాత్రి 
చిత్తూరు...

Saturday, March 5, 2016 - 13:23

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, సంగీత దర్శకుడు కీరవాణి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఉదయం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తుందని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీ ట్వంటీ వాల్డ్ కప్‌లోనూ టీంఇండియానే ఫేవరెట్‌...

Wednesday, March 2, 2016 - 15:11

చిత్తూరు : జిల్లాలోని కల్యాణిడ్యాం పోలీస్‌ శిక్షణ కళాశాలలో ఎస్సై తులసిరామ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో తులసిరామ్‌ను రుయా ఆస్పత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని తులసిరామ్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం పుత్తూరులో ఉగ్రవాదుల ఆపరేషన్‌లో తులసిరామ్‌ కీలకపాత్ర...

Wednesday, March 2, 2016 - 06:28

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించేది లేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 9,93,891 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు....

Pages

Don't Miss