చిత్తూరు
Thursday, August 20, 2015 - 11:41

చిత్తూరు: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు దగ్గర సోదాలు జరిపిన పోలీసులు ఈ దుంగలను గుర్తించారు. వీటి విలువ దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

 

Wednesday, August 19, 2015 - 18:37

చిత్తూరు : కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు...కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో మెగా ఫుడ్‌పార్క్‌ రాబోతుందని..అంతేకాక మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు...

Wednesday, August 19, 2015 - 18:35

చిత్తూరు: జిల్లా నగరిలో రాజకీయం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడుల మధ్య నెలకొన్న విబేధాలు ఆధిపత్యపోరుగా మారినట్లు స్పష్టమవుతోంది. నగరిలో ఎమ్మెల్యే రోజా తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. సినీ ఫక్కీలో జరిగిన నగరి నిరసన ఎపిసోడ్‌లో ఛేజింగ్‌లు సైతం చోటు చేసుకున్నాయి.

అధికార, ప్రతిపక్ష పార్టీల కుమ్ములాటలు......

Wednesday, August 19, 2015 - 16:33

తిరుపతి: ఒకవైపు బంద్‌ నిర్వహిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మరోవైపు వారిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్న పోలీసులు.. మొత్తం మీద చిత్తూరు జిల్లా నగరిలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే కొందరు నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎమ్మెల్యే రోజాను కూడా అరెస్ట్‌ చేయాలని ప్రయత్నించారు. సినీ ఫక్కీలో ఆమె వాహనాన్ని వెంబడించారు. అయితే సరిహద్దులు దాటి తమిళనాడులోకి తన...

Wednesday, August 19, 2015 - 12:41

తిరుపతి : యూనివర్సిటీలో నీటి సమస్య పరిష్కరించాలని ఎస్వీ విద్యార్థులు కదం తొక్కారు. గత నాలుగు రోజులుగా సమస్య తీర్చాలని కోరుతున్నా అధికారుల మొండి వైఖరిని తప్పుబట్టారు. నీళ్లు లేకపోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉన్నారని విద్యార్థులు పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా చిత్తూరు - తిరుపతి రహదారిపై భైఠాయించారు. వీరి...

Wednesday, August 19, 2015 - 12:37

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచాలని ఏపీ ఆర్టీసీ యోచిస్తోంది. సంస్థపై భారాన్ని తగ్గించాలంటే చార్జీలు పెంచకతప్పదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంది. చార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనికి పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కొద్ది రోజుల తరువాత ఆర్టీసీ సంస్థ...

Wednesday, August 19, 2015 - 11:22

చిత్తూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల దగ్గరి నుండి బాబు వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వెంటనే అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము బాబును కలుస్తామని, ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఎమ్మార్పీఎస్...

Tuesday, August 18, 2015 - 19:39

చిత్తూరు : జిల్లా కలెక్టర్ కలెక్టర్ సిద్ధార్థ జైన్ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు గ్రేంపేట్‌లోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రెవిన్యూ ఉద్యోగులు ర్యాలీ చేపట్టి..ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం బయట ఆత్మగౌరవ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. జిల్లాలో తామంతా ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నా..తమల్ని...

Tuesday, August 18, 2015 - 16:31

చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలో ఏసీ చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పంలో డ్వాక్రా మహిళా సంఘాలతో ఆయన చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటికి నేరుగా పెన్షన్ పంపిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. రేషన్ నిబంధనలను సవరించి...ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యాన్ని ఇస్తున్నామని చెప్పారు. 20 రూపాయలకే ఉల్లిగడ్డలు విక్రయించి...పేదలను...

Monday, August 17, 2015 - 13:33

చిత్తూరు : ఎస్వీయూలో ర్యాగింగ్‌ ఘటనపై మంత్రి గంటాశ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించారంటూ ఆరోపణలొచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఈ...

Monday, August 17, 2015 - 11:23

తిరుపతి : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి ఘటన మరిచిపోక ముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. అనంతరం విసి, రిజిష్ట్రార్ లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ర్యాగింగ్ జరిగిందని ధృవీకరించారు. దీనికి...

Pages

Don't Miss