చిత్తూరు
Sunday, December 27, 2015 - 15:30

చిత్తూరు : తిరుమలలోని యాత్రీసదన్‌లో ఉదయం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి భక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పలువురు యాత్రికుల వస్తువులు ధ్వంసం కావడంతో పాటు.. భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఓ గదిలో దాక్కున్న సైకోను అదుపులోకి తీసుకున్నారు.

 

 

Saturday, December 26, 2015 - 06:42

చిత్తూరు : ఎర్రబండ అటవీప్రాంతంలో పోలీస్‌ కాల్పుల కలకలం చెలరేగింది. కూంబింగ్‌కు వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌కు 40 మంది ఎర్రచందనం కూలీలు ఎదురుపడ్డారు. దీంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో ఎర్రచందనం కూలీలు పారిపోయారు. డిఐజీ కాంతారావు ఘటనాస్థలానికి బయల్దేరివెళ్లారు.

Friday, December 25, 2015 - 20:03

హైదరాబాద్ : ఏపీలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జన్మించిన రోజున ఆయన్ను ఆరాధిస్తూ.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో.. క్రిస్మస్‌ పర్వదినాన్ని...

Thursday, December 24, 2015 - 13:42

తిరుపతి : ఏపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సమ్మెలో పాల్గొన్న అంన్ వాడీలను తొలగిస్తూ... ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. జీవోకు వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీల తొలగించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని అంటున్నారు....

Tuesday, December 22, 2015 - 12:55

చిత్తూరు : జిల్లాలో మేయర్ కటారి అనురాధ దంపతుల హత్యకేసులో విచారణ వేగవంతం అయింది. ఈ హత్యకేసులో 16 మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే వాదనలు విన్న కోర్టు...జనవరి 4వరకు రిమాండ్ పొడిగించారు. వెంటనే నిందితులను భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. 

Monday, December 21, 2015 - 08:25

తిరుమల : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తకోటి తరలొచ్చింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వైకుంఠం-1, 2 కాంప్లెక్స్‌ల్లోని 64 కంపార్టమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తుల క్యూలైన్లను పశ్చిమ, ఉత్తర మాడవీధుల్లోని...

Monday, December 21, 2015 - 06:29

తిరుమల : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల భక్తజన సంద్రమైంది. ఉత్తర ద్వార దర్శనం కోసం.. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లతో పాటు.. నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక క్యూలైన్‌లలోనూ భక్తులు నిండిపోయారు.

వైకుంఠద్వార దర్శనానికి భక్తుల పడిగాపులు...

Sunday, December 20, 2015 - 19:30

తిరుపతి : వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమలలో భక్తులు పోటెత్తారు. క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్‌లన్నీ నిండి.. క్యూలైన్లు బయటకు వచ్చాయి. ఇక బయట ఉన్న భక్తులందరూ టీటీడీ నారాయణగిరి ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. వీరిని రేపు ఉదయం నాలుగు గంటలకు క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. దాదాపు 60 వేల మంది భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూలైన్లలో వేచివున్నారు. ఇక ఏర్పాట్లను టీటీడీ ఈవో,...

Sunday, December 20, 2015 - 10:39

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది కంటే ఎక్కువమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వీలైనంత ఎక్కువగా సామాన్యులకే కల్పించాలని టీటీడీ భావిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లను ఈవో...

Friday, December 18, 2015 - 08:07

చిత్తూరు : నిఘా కళ్లు...నిత్యం అధికారులు..పోలీసుల కూంబింగ్...ప్రాణాలు తీసే ఎన్ కౌంటర్లు...ఎన్ని చర్యలు తీసుకున్నా ఎర్రచందనం దుంగల స్మగ్లర్ల ఆగడాలు ఆగడం లేదు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేస్తున్నా 'ఎర్ర' దొంగలు భయపడడం లేదు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని జూ పార్కుకు కూత వేటు దూరంలోని అడవీలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కొద్దిదూరం వెళ్లిన...

Thursday, December 17, 2015 - 12:27

చిత్తూరు : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త టిడిపి కీలక నేత కఠారి మోహన్ హత్య కేసులో మరో సంచలన ఘటన నమోదైంది. మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, 38వ డివిజన్ కార్పొరేటర్ శివ ప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ ప్రసాద్ రెడ్డి మృతి...

Pages

Don't Miss