చిత్తూరు
Monday, July 27, 2015 - 15:44

చిత్తూరు: యూనివర్సిటీల్లో సీసీ కెమెరాల అమరికతోపాటు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అటెండెన్స్ 100 శాతంతోపాటు ఫర్మామెన్స్ కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు....

Monday, July 27, 2015 - 13:22

తిరుపతి : నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపించనున్నట్లు మంత్రి గంటా తిరుపతిలో తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత రిషితేశ్వరి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు....

Sunday, July 26, 2015 - 21:48

చిత్తూరు: జిల్లా శ్రీకాళహస్తిలో అగ్నిగుండం ప్రవేశంలో అపశృతి చోటుచేసుకుంది. ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయ సమీపంలోని గుండంలో ప్రమాదవశాత్తూ పడి ముగ్గురు భక్తులు గాయపడ్డారు.

 

Sunday, July 26, 2015 - 21:13

తిరుపతి: శేషాచలం అటవీప్రాంతంలోని పగటి గుండాలకోనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 20 మంది కూలీలు పరారయ్యారు. పారారైన కూలీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతకముందు లొంగిపోవాలంటూ పోలీసులు కూలీలకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ...

Saturday, July 25, 2015 - 18:25

చిత్తూరు: తిరుపతిలో సైకో వీరంగం సృష్టించాడు. బ్లేడుతో గొంతుకోసుకొని నానా హంగామా చేశాడు. తిరుపతి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి.. అందర్నీ చంపేస్తానంటూ కొద్ది సేపు హంగామా చేశాడు. సైకోను పోలీసులు అరెస్టు చేశారు.

Saturday, July 25, 2015 - 15:49

చిత్తూరు: టీటీడీలో ఖాళీగాఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఈ నిరసనకు డివైఎఫ్ఐ, ఎస్ ఎఫ్ ఐ సంఘాలు సంఘీభావం తెలిపాయి.

 

Saturday, July 25, 2015 - 12:42

చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి జడ్పీ హైస్కూల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన 14 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Tuesday, July 21, 2015 - 13:11

చిత్తూరు : తీవ్ర కలకలం రేపిన శేషాచలం ఎన్ కౌంటర్ లో సాక్షులను సిట్ బృందం ఏపీకి తీసుకరావడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత వైగో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై సీఎం జయలలిత జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు.
ఎన్ కౌంటర్ ప్రదేశానికి సాక్షులు.....

Sunday, July 19, 2015 - 20:56

చిత్తూరు: సీఎం చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్స్ లీ హిల్స్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే...ఈ నెల 24న అనంతపురం జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని చెప్పారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిధులు, ఏపీకి...

Sunday, July 19, 2015 - 20:32

చిత్తూరు: టీటీడీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురయింది. ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శనం టికెట్లు విక్రయించే వెబ్‌సైట్‌ను...దుండగులు హ్యాక్ చేశారు. కోయంబత్తూర్, షోలాపూర్‌ కేంద్రంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో టికెట్లు పెట్టిన వెంటనే..సైట్‌ను హ్యాక్‌ చేసి టికెట్లను గుంపగుత్తగా...క్షణాల్లో బుక్ చేస్తున్నారు. టీటీడీ సర్వర్‌ను హ్యాక్ చేసి సాక్ష్యాలు దొరక్కుండా... జాగ్రత్త...

Sunday, July 12, 2015 - 18:54

చిత్తూరు: తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించే అంశం డిఫెన్స్ పరిధిలోనిదని కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. టిడిపి కేంద్ర అధికార ప్రతినిధి కంభంపాటి రాంమోహన్, మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిలతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

 

Pages

Don't Miss