చిత్తూరు
Sunday, January 28, 2018 - 12:16

చిత్తూరు : తిరుపతిలో ఆర్టీసీ బస్సులు  బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బాలాజీలింక్‌ బస్టాండ్‌లో ఓ భక్తునిపైకి ఆర్టీసీబస్సు దూకెళ్లిన ఘటలనో ఓ భక్తుడు మృతి చెందాడు. అయితే భక్తునివద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు అన్నమయ్యసర్కిల్‌ వద్ద కోమలమ్మ అనే వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. 

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Thursday, January 25, 2018 - 20:02

చిత్తూరు : జిల్లాలోని నగరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగికి ఇంజెక్షన్‌ వికటించింది. రోగి పిరుదులపై తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ రావడంతో బాధితుడిని చెన్నై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. 

 

Wednesday, January 24, 2018 - 13:31

చిత్తూరు : తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చినశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రాత్రి వరకు 7 వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఒక్కరోజు వేడుకగా భావించే ఈ రథసప్తమి పర్వదినాన... ఒక్కరోజే ఏడు వాహనాలపై శ్రీవారు కనువిందు చేస్తారు. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తారు. 

 

Tuesday, January 23, 2018 - 15:07

చిత్తూరు : జిల్లా తిరుపతిలో ప్రియుడి నయవంచనకు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడాది కాలంగా ఈ యువతిని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని ప్రేమికుడు పరారయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, January 22, 2018 - 22:02

చిత్తూరు : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే 2019లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తామన్నారు. ఇంగ్లీష్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు జగన్‌ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Sunday, January 21, 2018 - 18:48

చిత్తూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. జగన్ పాదయాత్ర సభలో స్టేజీ కూలింది. సభ జరుగుతుండగా స్టేజీపైకి కార్యకర్తలు అధిక సంఖ్యలో వెళ్లడంతో స్టేజీ కూలింది. దీంతో వైసీపీ నేతలు కిందపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు, మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులను మాత్రం జగన్ పరామర్శించలేదు. గాయపడినవారి...

Saturday, January 20, 2018 - 13:25

చిత్తూరు : తిరుపతిలో నకిలీ డాక్టర్‌ హల్‌ చల్‌ చేశాడు. డాక్టర్‌ పేరు చెప్పి గోపి మాధవి ఆస్పత్రిలో ప్రవేశించాడు. ఆస్పత్రిలోని ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించి ఉడాయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, January 19, 2018 - 09:51

విజయవాడ : మీ నియోజకవర్గంలో ఈసారి గెలుపు మాదే.. కాదు మీ ఇలాఖాలో మాజెండానే ఎగురుతుంది.. ఇదీ ఇపుడు ఏపీలో అధికార, విపక్షపార్టీ నేతల మధ్య నడుస్తున్న డైలాగ్‌వార్‌. పులివెందులలో గెలుపుమాదే అంటున్న టీడీపీ నేతలకు .. కుప్పంలో మేమేపాగా వేస్తామని వైసీపీ నాయకులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో కడప జిల్లా పులివెందులలో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఏపీలో...

Pages

Don't Miss