చిత్తూరు
Saturday, October 28, 2017 - 15:36

చిత్తూరు : శ్రీ వెంకటేశ్వరస్వామివారి వార్షిక పుష్పయాగాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతీ యేటా శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది మొత్తం తెలిసో తెలియకో శ్రీవారి ఆలయంలో జరిగే పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం చేస్తారు. తమిళనాడు, కర్నాటక, రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తం 9 టన్నుల పూలతో ఈ...

Wednesday, October 25, 2017 - 17:36

చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణ హత్య గావించబడ్డారు. కడప జిల్లా పులివెందులకు చెందిన ముణికుమార్ (25) రోడ్డు పనుల్లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. ఈనేపథ్యంలో మదనపల్లిలో యువకుడిని దుండగలు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుపై మృతదేహాన్ని దుండగులు కప్పి పెట్టారు. మృతుడి కాలు కనబడటంతో కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కేసు...

Wednesday, October 25, 2017 - 10:34

చిత్తూరు : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించడంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ టిటిడి ఈవోను కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు గతంలోనే భక్తులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై టిటిడి అధికారులు ఎలాంటి చర్యలు...

Sunday, October 22, 2017 - 18:24

చిత్తూరు : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద క్షురకుల ధర్నా కొనసాగుతుంది. తమను విధుల నుంచి టీటీడీ అకారణంగా తొలగించిందంటూ గత కొన్ని రోజులుగా క్షురకులు ఆందోళన బాట పట్టారు. నిరసనలో భాగంగా టీటీడీ తీరును ఎండగడుతూ.. ఇవాళ వారు గుండు గీయించుకున్నారు. టీటీడీ అధికారులు తమపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుట్ర పూరితంగానే తమను రోడ్డున పడేశారని వాపోయారు.

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 15:35

చిత్తూరు : తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంది. రెండు క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్ మెంట్ లలో భక్తులతో కిటకిటలాడుతోంది. బయట కూడా భారీగా క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం 16గంటల సమయం పడుతోంది. ఒక్కసారిగా పెరిగిన రద్దీతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసందర్భంగా టిటిడి జేఈవో శ్రీనివాసరాజుతో టెన్ టివి ముచ్చటించింది....

Saturday, October 21, 2017 - 12:16

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల నిలిచి ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss