చిత్తూరు
Saturday, May 5, 2018 - 21:34

ఢిల్లీ : టీటీడీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పదించారు. టీటీడీ సహా ఏ దేవాలయం కానీ, మసీదును కానీ కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోదని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ తనకు స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం...

Saturday, May 5, 2018 - 21:26

తిరుమల : టీటీడీ పరిధిలోని ఆలయాలు, కట్టడాలను రక్షిత కట్టడాలుగా కేంద్ర పురావస్తు శాఖ ప్రకటించింది. ఆలయాలు, చరిత్రను పరిశీలించిన తర్వాత పురావస్తు శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు కేంద్ర పురవాస్తుశాఖ లేఖ రాయడంపై దుమారం చెలరేగింది. టీటీడీ పరిధిలోని దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ...

Saturday, May 5, 2018 - 17:44

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు కేంద్ర పురావస్తు శాఖ లేఖ జారీ చేసింది. టీటీడీకి చెందిన ఆలయాలు, భవనాల వివరాలన్నీ అందించాలని టీటీడీ ఈవోకు లేఖ రాసింది. తిరుమలలో కట్టడాలకు రక్షణ కరువైందనీ., టీటీడీ అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో పురాతన కట్టడాలను తొలగిస్తున్నారని కేంద్ర పురావస్తుశాఖకు అనేక ఫిర్యాదులు అందటంతో స్పందిన పురావస్తు శాఖ తాజాగా టీడీపీ ఈవో ఏకే...

Friday, May 4, 2018 - 11:44

చిత్తూరు : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంపాడులో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం చెందారు. వర్షం రావడంలో చెట్టుకిందకు వెళ్లారు. చెట్టుకింద కూర్చున్న మునేంద్ర, దాసిరెడ్డి, గురువారెడ్డిలపై పిడుగుపడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

 

Thursday, May 3, 2018 - 09:14

చిత్తూరు : "భరత్‌ అనే నేను " మూవీ ఫేం- కైరా తిరుపతిలో  సందడి చేసింది. ఓ మొబైల్‌షాపు ప్రారంభానికి వచ్చిన ఆమె.. భరత్‌ అనే నేను సినిమాను సక్సెస్‌ చేసినందుకు అభిమానులకు అభినందనలు తెలిపింది. కైరాను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈసందర్భంగా  అభిమానులతో కలిసి కైరా సెల్ఫీలకు ఫోజులిచ్చి సందడి చేసింది.

 

Wednesday, May 2, 2018 - 16:38

చిత్తూరు : వైసీపీ నేత శ్రీనివాసుల రెడ్డి మృతి చెందడంపై వైసీపీ నేతలు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన శ్రీనివాసులకు సరైన వైద్యం అందించలేదని మండిపడ్డారు. రిమ్స్‌ వైద్యుల నిర్లక్ష్యమే శ్రీనివాసుల మృతికి కారణమని ఆరోపించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ శశిధర్‌పై వైసీపీ నేత అవినాశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఆస్పత్రి పని తీరు మార్చుకోకపోతే ఆందోళన...

Tuesday, May 1, 2018 - 12:51

చిత్తూరు : తిరుపతిలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో కార్మికులు జెండా ఎగురవేశారు. కార్మికుల ఐక్యత వర్థిల్లాలంటూ నినాదాలు  చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని నేతలు విమర్శించారు. కార్పొరేట్‌శక్తులకు రెడ్‌కార్పెట్‌ పర్చుతూ.... కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయన్నారు.

 

Tuesday, May 1, 2018 - 07:54

చిత్తూరు : తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభలో బీజేపీ, వైసీపీలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది తిరుమల వెంకన్నసాక్షిగా  తేల్చుకుందామని బీజేపీ, వైసీపీలకు సవాల్‌ విసిరారు. 
అంతిమ విజయం మాదే : చంద్రబాబు
ప్రత్యేకహోదా సాధన కోసం టీడీపీ చేపట్టిన...

Monday, April 30, 2018 - 21:47

చిత్తూరు : ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ హామీ ఇచ్చి మోసం చేయడంతో 'నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై' తిరుపతిలో టీడీపీ భారీ సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరముందన్నారు చంద్రబాబు. జగన్‌పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదాపై వైసీపీ డ్రామాలాడుతూ.. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు...

Pages

Don't Miss